Moscow: రష్యా ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అక్కడి అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యా తీరంలో రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు.
పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి, దానితో పాటు హవాయిలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ముందు జాగ్రత్తగా సూచనలు జారీ చేశారు.
Readmore: https://teluguprabha.net/international-news/indonesian-passenger-ferry-catches-fire-at-sea/
పసిఫిక్ మహా సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటనకు ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. ఈ భూకంపాల కారణంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని, అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు సరైన సమాచారం తెలియలేదు. గంటలోనే వరుసగా 5 సార్లు భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వీటిల్లో 7.4 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఆ ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Readmore: https://teluguprabha.net/international-news/narendra-modi-to-visit-uk-maldives-on-official-trip/
ఓ వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు భారీ భూకంపాలు, సునామీల హెచ్చరికతో రష్యా ఆగమ్యగోచరంలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


