Saturday, October 5, 2024
Homeఇంటర్నేషనల్Turkey: ఒక రోజులోమూడుసార్లు భూకంపం, 2,300మంది మృతి..లెక్క తేలని మృతుల సంఖ్య

Turkey: ఒక రోజులోమూడుసార్లు భూకంపం, 2,300మంది మృతి..లెక్క తేలని మృతుల సంఖ్య

వరుస భూకంపాల ధాటికి టర్కీ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ఇళ్లలోకి వెళ్లాలంటేనే టర్కీ, సిరియా ప్రజలు గజగజలాడుతున్నారు. 24 గంటల్లో మూడుసార్లు వచ్చిన భారీ భూకంపం ధాటికి టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 2,300దాటగా..ఇవి మరిన్ని పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.

- Advertisement -

వరుసగా భూమి కంపిస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. భూకంపాలు వచ్చాక డజన్లకొద్దీ ప్రకంపనలు రావటంతో ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇక మొదటిసారి ఈరోజు తెల్లవారు జామున భూకంపం వచ్చాక 15 నిమిషాల పాటు భూమి పదేపదే కంపించటంతోపాటు 50 సార్లు ఆఫ్టర్ షాక్స్ దెబ్బకి టర్కీ, సిరియా ప్రజలు వణికిపోయారు.

పదేపదే భూకంపాలతో టర్కీలో చాలామందికి భూప్రకంపనలు గతకొన్నేళ్లుగా అలవాటు అయ్యాయి. యాక్టివ్ ఎర్త్ క్వేక్ జోన్స్ ఉన్న దేశంగా టర్కీ కొన్ని దశాబ్దాలుగా ఉంది. కానీ ప్రస్తుతం వచ్చిన భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు కూలి.. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారు తమకు సాయం చేయమని ఆర్తనాదాలు చేస్తుండటంతో సిరియా, టర్కీలోని పలు ప్రాంతాల్లో మరణమృందంగం మోగుతోంది. ఇక పదేపదే వస్తున్న భూకంపాలతో సహాయ, పునారావాస చర్యలు ఎలా చేపట్టాలో ఎవరకీ అంతుచిక్కటం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News