టర్కీ భూకంపానికి మరణించిన వారి సంఖ్య 20,000 దాటింది. నాలుగు రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం ధాటికి టర్కీ-సిరియా సరిహద్దుల్లో అత్యధికులు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు మాత్రం చాలా ఆలస్యంగా సాగుతుండటంతో ఇక శిథిలాల కింద బతికున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. ఓవైపు వణికించే చలితో సహాయ, పునరావాస కార్యక్రమాలు చాలా ఆలస్యంగా సాగుతుండటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శిథిలాల నుంచి ప్రాణాలతో బయట పడ్డవారికి కనీసం తాగు నీరు, తిండి, మంచు కురుస్తుండగా కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేక వణికిపోతున్నారు. -5 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద సహాయ చర్యలు చేపట్టడం అతి పెద్ద సవాలుగా మారింది. ఇక భారత్ సహా పలు ప్రపంచదేశాలు టర్కీ భూకంప బాధితులకు అండగా నిలుస్తున్నాయి.
Turkey earthquake: టర్కీలో 20,000 దాటిన మృతులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES