Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Turkey Syria earthquake: 7,800 మృతదేహాల వెలికితీత

Turkey Syria earthquake: 7,800 మృతదేహాల వెలికితీత

టర్కీ-సిరియాను కుదిపేసిన భూకంప బాధితుల ఆర్తనాదాలతో ఈ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. మరుభూమిని తలపిస్తున్న ఈ ప్రాంతాలన్నీ మృత్యుఘోషతో మారుమోగుతున్నాయి. ఇరు దేశాల్లో ఇప్పటికే 7,800 మృతదేహాలు వెలికితీశారు. సహాయ చర్యలు ముమ్మరం కావటంతో ఈరోజు నుంచి శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసే చర్యలు వేగవంతం కానున్నాయి. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నట్టు, వారికి ఆపన్నహస్తం అందించి ప్రాణాలు కాపాడేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాత్రిళ్లు మంచు కురుస్తూ, పళ్లు కొరికే చలిలో తమను కాపాడుకునేందుకు వీరంతా చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మృతుల సంఖ్య 20,000 దాటేలానే కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఇక భూకంపంతో 23 మిలియన్ల మంది నానా అగచాట్లు పడాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad