Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Recognise Palestine: బ్రిటన్‌, కెనడా కీలక నిర్ణయం.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ సంచలన ప్రకటన

Recognise Palestine: బ్రిటన్‌, కెనడా కీలక నిర్ణయం.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ సంచలన ప్రకటన

UK And Canada Recognise Palestine: బ్రిటన్‌, కెనడా ప్రభుత్వాలు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. పాలస్తీనాను అధికారికంగా దేశంగా గుర్తించాయి. ఇటు బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ కార్యాలయం, అటు కెనడా ప్రధాని కార్యాయం ఈ విషయాన్ని ప్రకటించాయి. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో శాంతి నెలకొంటుందనే ఆశాభావంతో పాలస్థీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. మధ్యప్రాశ్చంలో శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానం అవసరమని తెలిపారు. ద్విదేశ విధానంతో ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండటంతోపాటు సుస్థిర పాలస్తీనా సాధ్యమని పేర్కొన్నారు. మరోవైపు, పాలస్తీనీయులు, ఇజ్రాయెల్‌ పౌరుల్లో శాంతిస్థాపన ఆశలను పునరుద్ధరించేందుకు, ద్విదేశ పరిష్కారం కోసం ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణకు, ఐక్యరాజ్య సమితి సాయం అనుమతికి, దీర్ఘకాలిక శాంతికి ఇజ్రాయెల్ అంగీకరించని పక్షంలో.. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జులైలోనే స్టార్మర్‌ హెచ్చరించారు. ఇటీవల బ్రిటన్‌ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. స్టార్మర్‌ ప్రభుత్వ ప్రణాళికలను వ్యతిరేకించారు. ఈ విషయంలో ప్రధాని స్టార్మర్‌తో విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు 140కి పైగా దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించాయి. త్వరలోనే ఫ్రాన్స్‌ తదితర దేశాలూ ఈ మేరకు ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు, పాలస్తీనాను దేశంగా గుర్తించే విషయంలో బ్రిటన్‌ తదితర దేశాల ప్రణాళికలను అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల ప్రతినిధులు ఇప్పటికే ఖండించారు. ఉగ్రవాదంతో పాటు 2023 అక్టోబరు 7నాటి దాడుల విషయంలో హమాస్‌కు బ్రిటన్‌ బహుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ విమర్శించింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/heavy-rains-in-hyderabad-2/

హమాస్, ఇజ్రాయెల్‌పై కెనడా విమర్శలు

హమాస్, టెల్ అవివ్‌పై కెనడా పీఎం కార్యాలయం విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్‌లో హమాస్ భయోత్పాతం సృష్టిస్తే, గాజా ప్రజల ‘అణచివేత’కు ఇజ్రాయెల్ పాల్పడిందని తీవ్ర విమర్శలు చేసింది. అక్టోబర్ 7 దాడిలో బందీలుగా పట్టుకున్న వారిని విడుదల చేయాలని హమాస్‌కు విజ్ఞప్తి చేసింది. పాలస్తీనా స్థాపనను నిరోధించేందుకు టెల్ అవివ్ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ వచ్చిందని విమర్శించింది. గాజాలో వేలాది మంది పౌరులను హతమార్చి, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని తప్పుపట్టింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో నిర్దేశించిన ప్రాథమిక మానవ హక్కులు, కెనడా దశాబ్దాలుగా అనుసరిస్తున్న నిలకడైన విధానానికి అనుగుణంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు కెనడా పీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad