UK Couple Jailed Over Daughter’s Death: ఒకరు రాజకుటుంబంతో సంబంధాలున్న ఉన్నత వంశానికి చెందిన మహిళ. మరొకరు అత్యాచారం కేసులో శిక్ష అనుభవించిన నేరస్థుడు. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన పసికందు, వారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. కన్నబిడ్డ చావుకు కారణమైన ఈ జంటకు బ్రిటన్ కోర్టు సోమవారం జైలు శిక్ష విధించింది.
ALSO READ: Elon Musk: లండన్‌లో భారీ హింస.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. ‘పోరాడండి లేదా చావండి’ అంటూ..
వివరాల్లోకి వెళితే.. ఉన్నత కుటుంబానికి చెందిన కాన్‌స్టాన్స్ మార్టెన్ (38), నేరచరిత్ర ఉన్న మార్క్ గోర్డాన్ (51) సహజీవనం చేస్తున్నారు. వీరికి అప్పటికే నలుగురు పిల్లలు ఉండగా, వారిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో మార్టెన్ ఐదోసారి గర్భం దాల్చింది. పుట్టబోయే బిడ్డను కూడా అధికారులు తీసుకెళ్లిపోతారనే భయంతో, ఈ జంట ఎవరికీ తెలియకుండా దేశం విడిచి పారిపోయింది.
2023 జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో దాదాపు ఏడు వారాల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగారు. గడ్డకట్టే చలిలో ఒక టెంట్ వేసుకుని జీవనం సాగించారు. ఈ సమయంలోనే వారికి విక్టోరియా అనే ఆడబిడ్డ పుట్టింది. అయితే, వారి నిర్లక్ష్యం, కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ పసికందు ప్రాణాలు కోల్పోయింది. చివరకు పోలీసులు వారిని బ్రైటన్ నగరంలో అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల గాలింపు తర్వాత, ఒక షాపింగ్ బ్యాగ్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విక్టోరియా మృతదేహాన్ని కనుగొన్నారు.
ALSO READ: Trade War: ట్రంప్ 100% టారిఫ్ హెచ్చరిక.. ‘మేం యుద్ధాల్లో పాల్గొనం’ అంటూ చైనా ఘాటు జవాబు
ఈ కేసుపై విచారణ జరిపిన లండన్ కోర్టు, వారిని నరహత్య కింద దోషులుగా నిర్ధారించింది. బిడ్డ జననాన్ని దాచిపెట్టడం, విచారణను తప్పుదోవ పట్టించడం వంటి ఇతర నేరాలకు కూడా పాల్పడినట్లు తేల్చి, వారికి జైలు శిక్ష ఖరారు చేసింది. వారి స్వార్థపూరిత చర్యల వల్లే ఒక పసి ప్రాణం బలైపోయిందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: Donald Trump: కొరియా దెబ్బకు ట్రంప్ యూటర్న్.. విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలంటూ పోస్ట్


