Wednesday, April 2, 2025
Homeఇంటర్నేషనల్Zelenskyy: ఆస్తుల వివరాలు ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

Zelenskyy: ఆస్తుల వివరాలు ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy) తన ఆస్తులను ప్రకటించారు. జీతం, కుటుంబ ఆదాయం వంటి వివరాలను బహిరంగంగా వెల్లడించారు. 2024లో తన ఆదాయం 15.2 మిలియన్ల(రూ. 3.15 కోట్లు) ఉక్రేనియన్ హ్రైవ్నియాలని తెలిపారు. గత సంవత్సరం జీతంగా 3,36,000 ఉక్రేనియన్ హ్రైవ్నియాలను అందుకున్నట్లు పేర్కొన్నారు. 2023లో కుటుంబ ఆదాయం 12 మిలియన్ల(రూ.2.7కోట్లు) ఉక్రేనియన్ హ్రైవ్నియాలుగా ఉండగా.. 2024లో భారీగా ఆదాయం పెరిగింది. ప్రభుత్వ సేల్స్ బాండ్స్ నుంచి 8,585,532 (రూ.1.77 కోట్లు) హ్రైవ్నియాలు ఉన్నట్లుగా తెలిపారు.

- Advertisement -

ఈ వివరాల ప్రకారం 2023లో కంటే 2024లో ఆదాయం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో ప్రతి ఏడాది ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆనవాయితీ. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తమ ఆస్తుల వివరాలు బహిరంగంగా వెల్లడించాలి. కాగా 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్‌స్కీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2022లో ఉక్రెయిన్‌‌- రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూ వస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News