Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్USA: అమెరికాలో కుప్పకూలిన విమానం.. సోషల్‌ మీడియాలో షాకింగ్ విజువల్స్!

USA: అమెరికాలో కుప్పకూలిన విమానం.. సోషల్‌ మీడియాలో షాకింగ్ విజువల్స్!

Cargo plane crashes at Kentucky airport: అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్‌ సమయంలో కెంటకీలోని లూయిస్‌విల్లే ఎయిర్‌పోర్టులో విమానం కూలిపోయింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

యూపీఎస్‌ ఫ్లైట్‌ నంబర్‌ 2976 విమానం: అమెరికాలోని లూయిస్‌విల్లేలో విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్‌ సమయంలో యూపీఎస్‌ కార్గో విమానం కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. దీంతో ఫ్లైట్ పేలిపోయి పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. యూపీఎస్‌ ఫ్లైట్‌ నంబర్‌ 2976 విమానం హవాయ్‌లోని హోనులులుకు సాయంత్రం (అమెరికా కాలమానం) 5.15కు బయల్దేరగా ఈ జరిగింది.

ధ్రువీకరించిన అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌: విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలోనే ఒక్కసారిగా మంటలు ఎగసి కుప్పకూలిపోయింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విమానం మెక్‌డోనెల్‌ డగ్లస్‌ ఎండీ-11 రకానికి చెందినదిగా అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనను అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ధ్రువీకరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad