Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump: ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ వార్’- రక్షణ శాఖ పేరు మారుస్తూ ట్రంప్ నిర్ణయం

Trump: ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ వార్’- రక్షణ శాఖ పేరు మారుస్తూ ట్రంప్ నిర్ణయం

Trump: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తనశైలి పరిపాలనతో దూసుకుపోతున్నారు. ఇతర దేశాలతో సంబంధాలు, పన్నుల విషయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని పలు విభాగాలు, పాలనా పరమైన అంశాల్లో అనేక మార్పులు చేశారు. కాగా.. ప్రస్తుతం అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ వార్‌’ (Department of War)గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ పేరుతో మంత్రిత్వ శాఖ ఉండగా.. 1947 క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ వార్‌’ పేరును అగ్రరాజ్యం తొలగించింది. మళ్లీ దానిని పునరుద్ధరిస్తూ.. పెంటగాన్‌ పేరు మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు సిద్ధమయ్యారు.

- Advertisement -

Read Also: Harish Rao: కవిత సంచలన వ్యాఖ్యల వేళ కాంగ్రెస్ పై హరీష్ విమర్శలు

డిపార్ట్ మెంట్ ఆఫ్ వార్..

ఇకపోతే, అధ్యక్ష భవనంలో ట్రంప్ మాట్లాడారు. “పీట్‌ హెగ్సెత్‌ (Pete Hegseth) తరచూ అమెరికా రక్షణశాఖ (Defence Department) అంటూ సంబోధిస్తుంటారు. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. రక్షణ అనే పదం ఎందుకు? గతంలో పిలిచినట్లుగానే ఇకపై ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్‌’ అని పిలుద్దాం. అది ఎంతో శక్తిమంతమైన పదం. అదే శక్తితో గతంలో అమెరికా మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో విజయం సాధించింది. ప్రతి విషయంలోనూ ముందంజలో నిలిచింది. ఇప్పుడు కూడా అదే పేరుతో మరింత ముందుకు వెళ్దాం’’ అని ట్రంప్‌ అన్నారు. దీనికి ట్రంప్‌ పాలకవర్గ సభ్యులు కూడా మద్దతునిచ్చారు. దీంతో ఈ పేరు మార్పుపై త్వరలోనే ప్రకటన వెలువడనుంది. 1789లో అమెరికా యుద్ధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. యూఎస్ సైనిక, నావికా దళాలకు నాయకత్వం వహించేందుకు ఓ యుద్ధ కార్యదర్శి ఉండేవారు. తర్వాత, 1798లో ప్రత్యేక నేవీ విభాగాన్ని నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత .. 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం.. క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ ‘జాతీయ సైనిక సంస్థ’ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సైన్యం, వైమానిక దళ విభాగాలను రూపొందించారు. 1949లో సైన్యంలోని త్రివిధ దళాలను ఒకే డిపార్ట్ మెంట్ కిందకు తీసుకొస్తూ.. జాతీయ సైనిక సంస్థ పేరును రక్షణ శాఖగా మార్చారు. ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖ మంత్రిగా పీట్‌ హెగ్సెత్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read Also: Trump: ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ వార్’- రక్షణ శాఖ పేరు మారుస్తూ ట్రంప్ నిర్ణయం

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad