Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్US Birth Rate: అమెరికా చరిత్రలో.. ఎన్నడూ లేనంతగా పడిపోయిన జననాల రేటు!

US Birth Rate: అమెరికా చరిత్రలో.. ఎన్నడూ లేనంతగా పడిపోయిన జననాల రేటు!

US Fertility Rate Historic Low: అమెరికా సరికొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అది శత్రువులతోనో, ఆర్థిక మాంద్యంతోనో కాదు.. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా సంతానోత్పత్తి రేటు పాతాళానికి పడిపోయింది. ఇంతకీ అగ్రరాజ్యంలో ఈ పరిస్థితికి కారణమేంటి..? దీని భవిష్యత్ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి..? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి..?

- Advertisement -

ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో జనాభా పెరుగుదల ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా విడుదలైన ప్రభుత్వ గణాంకాలు దేశంలో సంతానోత్పత్తి రేటు చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరినట్లు వెల్లడించాయి. అమెరికాలో ప్రస్తుతం ప్రతి మహిళకు సగటున 1.6 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఒక తరం స్థానాన్ని మరో తరం భర్తీ చేయాలంటే (జనాభా పునరుత్పత్తికి) ఈ రేటు కనీసం 2.1గా ఉండాలి. కానీ, దశాబ్దాలుగా ఈ రేటు క్రమంగా తగ్గుతూ ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరింది.

ALSO READ: https://teluguprabha.net/international-news/america-wrestling-legend-hulk-hogan-dies-at-71/

గతం నుంచి వర్తమానానికి.. పడిపోతున్న రేటు : నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒకప్పుడు అమెరికాలో జననాల రేటు కళకళలాడుతూ ఉండేది.

1960లలో:  అమెరికాలో సంతానోత్పత్తి రేటు దాదాపు 3.5గా ఉండి, జనాభా బలంగా పెరిగింది.
1976 నాటికి: ఈ రేటు ఒక్కసారిగా 1.7 శాతానికి పడిపోయింది.
2007లో: పరిస్థితి కాస్త మెరుగుపడి, పునరుత్పత్తికి అవసరమైన 2.1 స్థాయికి చేరింది.
2024 నాటికి: ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2023లో 1.62గా ఉన్న రేటు, 2024 నాటికి మరింత క్షీణించి 1.59కి దిగజారింది. అయితే,ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల పెంపకానికి అయ్యే విపరీతమైన ఖర్చు వంటి సామాజిక, ఆర్థిక కారణాలు ఈ తగ్గుదలకు దోహదపడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ALSO READ:https://teluguprabha.net/international-news/india-uk-trade-deal-benefits-indian-farmers/

ప్రభుత్వ చర్యలు – ట్రంప్ ‘బేబీ బోనస్’ : పడిపోతున్న జననాల రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దీన్ని పెంచడానికి పలు చర్యలకు ఉపక్రమించారు. తల్లిదండ్రులు పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి “బేబీ బోనస్” ఆలోచనకు మద్దతు తెలిపారు. అంతేకాకుండా, సంతాన సమస్యలతో బాధపడేవారికి IVF చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చారు. అయితే, కేవలం ఇవి మాత్రమే సరిపోవని, పిల్లల సంరక్షణ (చైల్డ్‌కేర్), మహిళలకు మెరుగైన ప్రసూతి సెలవులు వంటి సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ:https://teluguprabha.net/international-news/trump-on-indian-employees-us-tech-companies/

ఆందోళన అవసరం లేదు: అయితే, ఈ గణాంకాలపై అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. సంతానోత్పత్తి, జనాభా విధానంపై అధ్యయనం చేసిన కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలు లెస్లీ రూట్ మాట్లాడుతూ, “దీనిని సంతానోత్పత్తి ఆలస్యం అవుతున్న ప్రక్రియగా చూడాలి. మహిళలు పిల్లలను కనడం మానేయడం లేదు, కాస్త ఆలస్యంగా కంటున్నారు. అమెరికా జనాభా ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. మరణాల కంటే జననాల సంఖ్యే ఎక్కువగా ఉంది,” అని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad