Hormuz Strait: ఇరాన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) అష్ట దిగ్బంధం చేయనున్నట్లుగా తెలిపారు. అందుకు అనుగూణంగా అమెరికా సేనలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించనుందని అన్నారు.
దిగ్బంధన సమయం: అమెరికా చేసిన ప్రకటన ప్రకారం.. ఈ దిగ్బంధనం సోమవారం ఉదయం 10 గంటలకు (అమెరికా కాలమానం) ప్రారంభం కానుంది. ఇది భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 7:30 గంటల నుంచి అమలులోకి రానుంది.
Also read-India: ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం హై అలర్ట్!
దిగ్బంధనం ఉద్దేశం: ఇరాన్ ఓడరేవుల నుంచి బయలుదేరే లేదా అక్కడికి ప్రవేశించే అన్ని దేశాల నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంటుంది. ఇరాన్‌కు అక్రమంగా టోల్ చెల్లించే ఏ ఒక్క నౌకను వదిలిపెట్టబోమని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచడం మరియు ఆ దేశానికి సంబంధించిన సముద్ర వాణిజ్యాన్ని పూర్తిగా స్తంభింపజేయడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం.

