Homeఇంటర్నేషనల్Donald Trump: ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్య నిలిపివేతకు యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదం!

Donald Trump: ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్య నిలిపివేతకు యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదం!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సొంత దేశంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలంటూ ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి యూఎస్ ప్రతినిధుల సభ (House of Representatives) ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఇరాన్‌పై దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ యంత్రాంగానికి బ్రేక్ పడినట్లయింది.

- Advertisement -

హోరాహోరీగా ఓటింగ్: ప్రతినిధుల సభలో ఈ తీర్మానంపై తీవ్ర చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యులు ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచారు. తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. దేశానికి ఎలాంటి ప్రయోజనం లేని, భారీ ఖర్చుతో కూడుకున్న అనవసర యుద్ధాలకు వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. అధ్యక్షుడి దూకుడు చర్యల వల్ల దేశం మరో యుద్ధంలోకి నెట్టబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఇరాన్ లక్ష్యంగా అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపిస్తుండగా.. మరోవైపు దేశీయంగా ట్రంప్ సైనిక చర్యలను అడ్డుకుంటూ ప్రతినిధుల సభ తీర్మానం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News