భారతీయ మూలాలున్న మన్ ప్రీత్ మోనికా సింగ్ అమెరికాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. టెక్సాస్ లో ఈ కార్యక్రమం ఈ శుక్రవారం జరుగనుంది. టెక్సాస్ లోని హ్యారిస్ కౌటీ సివిల్ కోర్టు జడ్జిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు మోనికా. మొత్తానికి మొట్టమొదటి సిక్కు మహిళా జడ్జిగా మోనికా రికార్డు సృష్టించారు.
- Advertisement -
500,000 మంది సిక్కులు అమెరికాలో అధికారికంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. భర్త, ఇద్దరు పిల్లలతో మోనికా ఇక్కడ నివసిస్తున్నారు. 1970ల్లోనే మోనికా తండ్రి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. 20 ఏళ్లుగా లా ప్రాక్టీస్ చేసూ..సివిల్ రైట్స్ యాక్టివిస్టుగా ఈమె అమెరికాలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఒక్క హ్యూస్టన్ ఏరియాలోనే 20,000 మందికి పైగా సిక్కులు నివసిస్తున్నారు.