Donald Trump: ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశానికి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. “ఇరాన్‌కు సమయం మించిపోతోంది.. వారు త్వరగా నిర్ణయం తీసుకుని చర్చల ఒప్పందానికి రావడం మంచిది. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ద్వారా ఒక పోస్ట్ పెట్టారు.
ట్రంప్ పోస్ట్ చేసిన సరికొత్త ఫోటో: ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించడంతో పాటుగా ఒక సరికొత్త ఫోటోను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) మ్యాప్‌పై అమెరికా జాతీయ జెండా విస్తరించి ఉన్నట్లు ఈ ఫోటోలో ఉంది. అందులో ఇరాన్, దాని పొరుగు దేశాల సరిహద్దుల నుండి ఇరాన్ వైపునకే గురిపెట్టినట్లుగా ఉన్న పలు బాణం గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫోటో అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Also read-Iran: ఈసారి భీకర దాడే.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ ఫోటోలో ఏం ఉందంటే: ఇరాన్‌ను అన్ని వైపుల నుండి అమెరికా చుట్టుముట్టిందనే సంకేతాన్ని ఇచ్చేలా ఈ ఫోటోను రూపొందించారు. ఒప్పందానికి రాకపోతే మిలిటరీ చర్యలు తప్పవనే హెచ్చరికను ట్రంప్ ఈ ఫోటో ద్వారా పరోక్షంగా పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఇరు దేశాల మధ్య సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో.. ట్రంప్ చేసిన ఈ తాజా పోస్ట్ పశ్చిమాసియాలో మరింత అలజడి సృష్టిస్తోంది.

