Homeఇంటర్నేషనల్USA: H-1B వీసాకు రూ. లక్ష డాలర్ల ఫీజు.. ట్రంప్‌కు మళ్లీ చుక్కెదురు

USA: H-1B వీసాకు రూ. లక్ష డాలర్ల ఫీజు.. ట్రంప్‌కు మళ్లీ చుక్కెదురు

US H-1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఇప్పటికే కఠిన నిబంధనలు అమల్లో ఉండగా.. తాజాగా ప్రవేశపెట్టిన మరో బిల్లు భారతీయ ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ టిమ్ షీహీ సెనెట్‌లో ప్రవేశపెట్టిన ‘ఎండ్ హెచ్-1బీ వీసా యాక్ట్’ బిల్లులో కొత్త హెచ్-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని ప్రతిపాదించారు. ఈ బిల్లులో ట్రంప్ యంత్రాంగం విధించిన లక్ష డాలర్ల వీసా ఫీజును చట్టబద్ధం చేయాలని కూడా సూచించారు.

- Advertisement -

ఉద్యోగాల భర్తీకి మాత్రమే.. 
అలాగే అమెరికా కార్మికుల ఉపాధి అవకాశాలకు భంగం కలిగించే విధంగా హెచ్-1బీ వీసాలను జారీ చేయరాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిమ్ షీహీ మాట్లాడుతూ.. “ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మాత్రమే హెచ్-1బీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ పథకాన్ని తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించేందుకు ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అర్హత కలిగిన అమెరికన్ ఉద్యోగులకు నష్టం జరుగుతోంది. అందుకే ఈ కార్యక్రమాన్ని అసలు ఉద్దేశానికి అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. హెచ్-1బీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు మూడు సంవత్సరాల పాటు కొత్త వీసాల జారీని నిలిపివేసిన అనంతరం కఠిన నిబంధనలతో కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆయన బిల్లులో ప్రతిపాదించారు.

Also Read: Jyothika: నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదం.. నటి జ్యోతిక ఆసక్తికర పోస్ట్‌!

ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన..
ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలీ క్రేన్ కూడా ప్రతినిధుల సభలో ఇదే తరహా బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లులో ప్రస్తుతం ఏటా జారీ చేస్తున్న 85,000 హెచ్-1బీ వీసాల సంఖ్యను తగ్గించాలని లాటరీ విధానానికి బదులుగా అత్యధిక వేతనం అందించే ఉద్యోగాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా హెచ్-1బీ వీసాదారులు తమ భార్య, పిల్లలను అమెరికాకు తీసుకెళ్లడంపై కూడా పరిమితులు విధించాలని ప్రతిపాదించారు. ఈ తాజా పరిణామాలు అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులు.. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News