Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump: డయాబెటీస్ ఉంటే అమెరికాలోకి నో ఎంట్రీ.. ట్రంప్‌ సర్కారు సంచలన నిర్ణయం..!

Trump: డయాబెటీస్ ఉంటే అమెరికాలోకి నో ఎంట్రీ.. ట్రంప్‌ సర్కారు సంచలన నిర్ణయం..!

US Visa New Rules Diabatic Patients Not to Allow into America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. రోజుకో కొత్త నిబంధన చేరుస్తూ వలసల్ని అడ్డుకుంటున్నారు. తాజాగా, ట్రంప్‌ సర్కార్‌ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త నిబంధనలను రూపొందించింది. ఈ మేరకు అన్ని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్‌ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీసా దరఖాస్తుదారులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశమున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేసినట్లు సమాచారం. దరఖాస్తుదారుల ఆరోగ్య ఖర్చులు భవిష్యత్తులో ప్రభుత్వ నిధులతో కూడిన వైద్య సంరక్షణపై ఆధారపడే అవకాశం ఉంటే వారి వీసాను తిరస్కరించేందుకు వీసా అధికారులకు వీలు కల్పించారు. వీసా దరఖాస్తుదారులకు ఆరోగ్య బీమా లేకపోయినా, వైద్య ఖర్చులు స్వయంగా చెల్లించే సామర్థ్యం లేకపోయినా వారి వీసాను తిరస్కరించేలా మార్గదర్శకాలు చేసినట్లు తెలుస్తోంది. హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక, ఒబెసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్‌ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరమవుతాయి. వీటికి ఆర్థిక భారం కూడా ఎక్కువేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలని, ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని మార్గదర్శకాల్లో ట్రంప్‌ సర్కార్‌ సూచించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

వలసదారుల మెడికల్‌ హిస్టరీపై ఆరా..!

సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్‌ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్‌ చేస్తారు. తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ మరిన్ని వ్యాధులను ఈ జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్‌ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు. అయితే, వలసదారులు అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సలను సొంతంగా భరించగలరా లేదా? అన్నది కూడా నిర్ధరించుకోవాలని వీసా అధికారులను ఆదేశించారు. ఇక, కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. అయితే, ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. దీంతో ఈ రూల్స్‌ అమల్లోకి వచ్చాయా లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఇప్పటికే వలసదారులకు సంబంధించి అమెరికా యంత్రాంగం కఠిన విధానాలను అమలు చేస్తోంది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజీ విజిటర్ల ‘డ్యురేషన్‌ ఆఫ్‌ స్టే’పై పరిమితి విధించడం, హెచ్-1బీ వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం తీసుకోవడం, తక్కువ సంఖ్యలో వీసా స్లాట్లు అందుబాటులోకి తేవడం వంటి కఠిన నిబంధనలను చేర్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad