Saturday, November 23, 2024
Homeఇంటర్నేషనల్US: డ్రాగన్ లా కనిపించేందుకు చెవులు, ముక్కు కట్

US: డ్రాగన్ లా కనిపించేందుకు చెవులు, ముక్కు కట్

వెర్రి వేయి రకాలని ఊరకే అనలేదు పెద్దలు. ఒకామెకు చిన్నప్పటి నుంచీ పాములు, డ్రాగన్స్ అంటే చచ్చేంత ఇష్టమట..అందుకే ఆమె తనకు ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్స్ చేయించుకుంది. దీంతో ఇప్పుడు ఈమె మానవ రూపంలో ఉన్న డ్రాగన్ లా కనిపిస్తోంది. ఇప్పుడు తన కల తీరిందని మురిసిపోతూ ఇన్స్టాలో ఫోటోలు పెడుతూ మురిసిపోతోంది.

- Advertisement -

అమెరికాలోని అరిజోనాలో పుట్టిన టైమట్ ఈవా మెడుసా పెద్ద పెట్ లవర్. జంతు ప్రేమికురాలైన ఈమె జంతువులు లేకుండా తన జీవితాన్ని కనీసం ఊహించుకోలేనని గర్వంగా చెబుతుంటారు కూడా. ముక్కు పుటలు, చెవులు ఆపరేషన్ ద్వారా తొలగించుకుని డ్రాగన్ లా కనిపించేందుకు ఈ బ్యాంకర్ చాలా కష్టపడ్డారు. పచ్చ బొట్లు వేయించేసుకుని, కళ్లు గ్రీన్ గా మార్పించుకుని.. చివరికి కొమ్ములను కూడా ఇంప్లాంట్ చేయించుకుంది. రెండు నాలుకల్లా కనిపించాలన్న కోరికతో నాలుకను లక్షల రూపాయలు వెచ్చించి రెండుగా కట్ చేయించుకుంది. ట్రాన్స్ జెండర్ అయిన తాను ఓ మహిళనని.. ప్రస్తుతం డ్రాగన్ గా కనిపిస్తూ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మానవులు చూపుతున్న వివక్ష, లైంగిక వేధింపులను తాళలేక ఇలా సరీసృపంగా మారిపోయినట్టు చెబుతున్నారు. 1990-2016 మధ్య కాలంలో తాను ఎలా రూపం మార్చుకున్నది ఫోటోలతో సహా ఆమె స్టోరీ రాసి అందరి కంట్లో పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News