Xi Jinping: ఉత్తరకొరియా అధ్యక్షుడు ఎట్టకేలకు దేశం వీడి చైనాలో పర్యటించారు. చైనా ఆయుధ ప్రదర్శనలో భాగంగా షీ జిన్‌పింగ్‌తో పాటు పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అయితే, ఆ కార్యక్రమం తర్వాత పుతిన్-కిమ్ భేటీ అయ్యారు. సమావేశం తర్వాత జరిగిన పరిణామాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భేటీ తర్వాత పుతిన్-కిమ్ (Putin-Kim) వెళ్లిపోగానే.. వారు కూర్చున్న ప్రదేశం వద్దకు ఇద్దరు వ్యక్తులు వేగంగా దూసుకొచ్చారు. ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని పూర్తిగా తుడిచివేశారు. నార్త్ కొరియా అధ్యక్షుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేశారు. ఆయన తాకిన ఫర్నీచర్‌ను క్లీన్ చేశారు. ఇంకొకరు ఆయన వాడిన గ్లాస్ అతి జాగ్రత్తగా ట్రేలో పెట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లేకుండా క్లీన్ గా తుడిచేశారు. అయితే, ఇదంతా ఆయన డీఎన్‌ఏ ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇలా వ్యవహరించారని రష్యా జర్నలిస్ట్ ఒకరు వెల్లడించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు చిక్కకుండా ప్రపంచ నేతలు జాగ్రత్తలు పాటిస్తుంటారు.
Read Also: Ganesh Chaturthi: గణేశుడికి బంగారు ఉండ్రాళ్లు..!
పుతిన్ గురించి..
మరోవైపు, ఇటీవలే అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) మధ్య జరిగిన కీలక భేటీ (Alaska Meeting) జరిగింది. 2.30 గంటలకు పైనే వీరి సమావేశం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశం ఫలప్రదమైందని పేర్కొన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలోనూ పుతిన్ కిమ్ తీసుకున్న జాగ్రత్తే తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. పుతిన్ మల వ్యర్థాలను తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఓ సూట్ కేసును ఆయన బాడీగార్డులు మోసుకెళ్లారట. ఆ పూప్ సూట్‌కేస్‌లో వాటిని సేకరిస్తారని ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెల్లడించాయి.
Read Also: Jio Offers: వార్షికోత్సవవేళ యూజర్లకు జియో బంపర్ ఆఫర్లు


