Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Elon Musk: లండన్‌లో భారీ హింస.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. 'పోరాడండి లేదా చావండి'...

Elon Musk: లండన్‌లో భారీ హింస.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. ‘పోరాడండి లేదా చావండి’ అంటూ..

Elon Musk’s “Fight Or Die” Message At London Rally: లండన్ వీధులు దద్దరిల్లాయి. బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద అతివాద మితవాద (ఫార్-రైట్) నిరసన కార్యక్రమంతో శనివారం నగరం ఉద్రిక్తంగా మారింది. సామాజిక కార్యకర్త టామీ రాబిన్సన్ పిలుపు మేరకు జరిగిన “యునైట్ ది కింగ్‌డమ్” ర్యాలీకి దాదాపు లక్షన్నర మంది హాజరయ్యారు. అయితే, ఈ శాంతియుత ప్రదర్శన కాస్తా హింసాత్మకంగా మారి, పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనల్లో పోలీసులు 25 మందిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

ALSO READ: London protest: బ్రిటన్ లో భారీ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ.. రోడ్లపైకి వచ్చిన లక్షల మంది

ఈ ర్యాలీకి ఎక్స్ (X) అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. నిరసనకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, “మీరు ఒక కీలకమైన పరిస్థితిలో ఉన్నారు. హింస మీ వద్దకే వస్తోంది. మీరు ఎదురుతిరిగి పోరాడండి, లేదా చావండి” అంటూ తీవ్రమైన హెచ్చరికలు చేశారు. వామపక్ష భావజాలం ఉన్నవారు హత్యలను ప్రోత్సహిస్తారని ఆయన ఆరోపించారు.

వలసలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ప్రదర్శనలో యూరప్‌లోని ఇతర ఫార్-రైట్ నాయకులు కూడా పాల్గొన్నారు. శ్వేతజాతీయుల స్థానంలో ఇతర ప్రాంతాల వారిని కావాలనే యూరప్‌లో నింపుతున్నారంటూ వివాదాస్పద “గ్రేట్ రీప్లేస్‌మెంట్” సిద్ధాంతాన్ని వారు పునరుద్ఘాటించారు.

ALSO READ: London rally: లండన్‌లో వలస వ్యతిరేక ర్యాలీలో చెలరేగిన హింస.. పోలీసులపై బాటిళ్లతో దాడి..

ఈ నిరసనల కారణంగా చెలరేగిన హింసలో 26 మంది పోలీసు అధికారులు గాయపడినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. కొందరి దంతాలు విరగగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది బ్రిటన్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఫార్-రైట్ ప్రదర్శన అని, దేశంలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావజాలానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు రాబిన్సన్ ర్యాలీ జరుగుతుండగానే, మరోవైపు జాతి వివక్షకు వ్యతిరేకంగా సుమారు 5,000 మంది వేరే ప్రదర్శన నిర్వహించారు.

ALSO READ: Canada: కార్మిక విధానాల్లో మార్పులు.. ఇకపై కెనడా వెళ్లి పనిచేయాలంటే కష్టమే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad