వీసా లేకుండా విదేశాలకు వెళ్లాలనుకుంటే? ఇది అసాధ్యమైతే కాదు. మన భారతీయులకు కొన్ని దేశాల్లో వీసా ఆన్ అరైవల్ ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉంది. మనం వీసా లేకుండా డైరెక్టుగా మనం ఎన్ని దేశాలకు వెళ్లే అవకాశం ఉందో తాజా సమాచారం ఇదిగో ఇక్కడుంది..చూడండి
పేపర్ వర్క్, అప్రూవల్స్, ఫీ కట్టడం, ఇంటర్వ్యూలు, రిజల్ట్ కోసం వేచి చూడటం ఈ టెన్షన్స్ వద్దనుకునే వారికి ఈ లోకంలో టూర్ కొట్టే ఛాన్సే లేదని మాత్రం అనుకోవద్దు.
చేతిలో పాస్ పోర్ట్ ఉంది, మనసులో తిరిగే ఉత్సాహం ఉందంటే మీ ప్రయాణానికి రెక్కలు తొడగచ్చన్నమాట. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని, లగేజ్ సర్దుకుని, చేతిలో వీసా లేకపోయినా జస్ట్ పాస్ పోర్ట్ పట్టుకుని ఫారిన్ కు చెక్కేస్తే. ఆసియా, ఆఫ్రికా ఖండంలో ఇలాంటి వారికి గ్రాండ్ వెల్కం చెప్పే దేశాలున్నాయి. కరీబియన్ దీవుల్లో కూడా మీకు రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కం చెబుతారు. ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్స్ కు వీసా దేశాలు 10 ఉన్నాయి.
థాయ్లాండ్
మన తెలుగోళ్లకి థాయ్లాండ్ బ్రహ్మాండంగా తెలుసు. థాయ్ అంటేనే ఆ బీచులు, స్ట్రీట్ ఫుడ్, మసాజ్.. నైట్ లైఫ్.. వారెవ్వా అనిపిస్తోందా.

మారిషస్
వైట్ సాండ్ బీచెస్ కు కేరాఫ్ మారిషస్. సన్సెట్, సన్ రైజ్, డ్రీమీ ఐలండ్ లైఫ్ ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలంటే మారిషస్ వెళ్లాల్సిందే. 90 డేస్ వీసా ఫ్రీ టూర్ ఎంజాయ్ చేసేయచ్చు. అచ్చు మాల్దీవ్స్ లానే ఉండే మారిషస్ ప్రత్యేకత ఏంటంటే మాల్దీవ్స్ కంటే బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఈజీ పీజీ.

ఇండోనేషియా
ఇక్కడేముంది చూసేందుకు అనుకోకండి, బాలీతో పాటు ఇంకా చాలా ప్లేసులే ఉన్నాయి ఇండోనేషియాలో. ఐల్యండ్లు, లష్ గ్రీనరీ, సూపర్ ఫుడ్, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం.. వాట్ నాట్. మనోళ్లు 30 రోజులపాటు ఇక్కడ ఎటువంటి వీసా లేకుండా ఎంజాయ్ చేయచ్చు.

సీషెల్స్
పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్ కు కేరాఫ్ సీషెల్స్. హాలీవుడ్ బీచ్ మూవీస్ అన్నీ ఇక్కడేగా షూట్ అయ్యేది. ట్రోపికల్ ప్యారడైజ్ గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీషెల్స్ లో ఇండియన్స్ 90 రోజులు వీసా ఫ్రీగా ఎంజాయ్ చేయచ్చు. లగ్జురీ వితౌట్ వీసా అనేది ఉందంటే అది ఇదేమరి. మరింకేం కమాన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్.

ఫిజి
పగడపు దీవులు, తక్కువ ఖర్చుతో డ్రీమీ వెకేషన్, ఐలండ్ లైఫ్ ఫుల్ టు బిందాస్ గా గడపాలంటే ఫిజి బెస్ట్ ప్లేస్. 120 రోజులపాటు ఇండియన్స్ ఇక్కడ వీసా ఫ్రీ లైఫ్ ఆస్వాదించవచ్చు. విదేశాల్లో 4 నెలలంటే మాటలా, జీవితకాలానికి అవసరమయ్యే ఆనందాన్ని పోగుచేసుకుని, మూటగట్టుకుని రావచ్చు.

సెర్బియా
సెర్బియాలో ఓ 30 రోజులు వీసా ఫ్రీ టూరిస్టుగా ఎంజాయ్ చేయచ్చు. యూరోప్ వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కదా. సెర్బియాలో నైట్ లైఫ్ చాలా ఫేమస్ కూడానూ.

బార్బడోస్
సన్ కిస్డ్ గెట్అవేకు బార్బడోస్ కేరాఫ్. 90 రోజులు ఇండియన్స్ ఇక్కడ హ్యాపీగా సస్పెండ్ చేయచ్చు. మిమ్మల్ని ఇక్కడ వీసా అస్సలు అడగరు. బీచులే బీచులు, ఫ్రెష్ సీ ఫుడ్ ఇక్కడ మీకు బోనస్ గా దొరుకుతుంది.

జమైకా
జమ్ జమైకాకు కూడా మీరు 30 రోజులపాటు వీసా ఫ్రీగా వెళ్లిరావచ్చు. జమైకన్ ఫుడ్, డ్యాన్స్ మనోళ్లకు బాగా తెలుసుకదా. ఇక్కడ వల్డ్ ఫేమస్ ఫుడ్, ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇంకేం హ్యాపీ కదా.

భూటాన్
ఈ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనదేశానికి ఆనుకునే ఉందనేమాటే కానీ ప్రపంచంలో హ్యాపియస్ట్ కంట్రీగా భూటాన్ కు పేరుంది. పాస్ పోర్ట్ లేదా ఓటర్ ఐడీ పట్టుకెళ్తేచాలు మన ఇండియన్స్ ను ఇక్కడ వీసా అస్సలు అడగరు. కొండలు-గుట్టలు మధ్య అద్భుతమైన లొకేషన్స్ ఉన్న ఊహాలోకం భూటాన్ లో ప్రశాంతతను టేస్ట్ చేసి రావచ్చు. కాకపోతే ఇక్కడ సస్టైనబుల్ డెవల్ప్మెంట్ ఫీ మాత్రం కట్టాలి తప్పదు. ఇది రోజుల లెక్కన కూడా కట్టచ్చు.

ఎల్సాల్వేడర్
అండర్ రేటెడ్ డెస్టినేషన్ గా దీనికి పేరుంది. అడ్వంచర్ లవర్స్ కు ఇది స్వర్గధామం అంటే నమ్మండి. మనోళ్లు 90 రోజులు ఇక్కడ హ్యాపీగా ఉండచ్చు. వాల్కనోల వెంట ట్రెక్కింగ్, మాయన్ నాగరికత శిథిలాలు, వల్డ్ క్లాస్ సర్ఫింగ్ మధ్య పెద్దే తెలీదు.
