Vladimir Putin fire on Donald trump: ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అధిక మానవ వనరులు గల ఇండియా, చైనా వంటి దేశాలతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలను డీల్ చేసేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హితవు పలికారు.
ఇంకా వలసవాద కాలంలోనే ట్రంప్: భారత్, చైనాలను సుంకాలతో బెదిరించి దారికి తెచ్చుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇలాంటి చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయడం సరికాదని తెలిపారు. ట్రంప్ ఇంకా వలసవాద కాలంలోనే ఉన్నారని ఘాటుగా విమర్శించారు. అప్పటి పద్ధతులను అనుసరిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చాటుకోవాలని విడ్డురంగా ఉందని అన్నారు. అప్పటి పద్ధతులు ఇప్పుడు పనిచేయవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెల్పాడు.
Also Read: https://teluguprabha.net/international-news/trump-orders-major-changes-us-military/
రాజనీతి అంటే అదికాదు ట్రంప్: వలసవాద కాలానికి.. ఇప్పటికి ప్రపంచం మారిపోయిందనే అంశాన్ని ట్రంప్ గుర్తించాలంటూ వ్లాదిమిర్ పుతిన్ హితవు పలికారు. భారత్, చైనాలపై అధిక సుంకాలు విధించడం సరికాదన్నారు. భాగస్వామ్య దేశాలతో ఇలా ప్రవర్తించడం రాజనీతి కాదన్నారు. ఇరు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితి తలెత్తిన సందర్భాల్లో ఒక దేశాధినేత బలహీనంగా కనిపించారంటే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని అన్నారు. ఈ విషయాన్ని ట్రంప్ దృష్టిలో పెట్టుకుని వ్లాదిమిర్ పుతిన్ కోరారు. భాగస్వామ్య దేశాలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరిపాలన్నారు. రాజనీతి అంటే సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం తప్ప పన్నులతో శిక్షించడం కాదని పుతిన్ స్పష్టం చేశారు.


