Friday, November 22, 2024
Homeఇంటర్నేషనల్Wall Street Journal: బీజేపీ.. ప్రపంచంలో అత్యంత కీలకమైన రాజకీయ పార్టీ

Wall Street Journal: బీజేపీ.. ప్రపంచంలో అత్యంత కీలకమైన రాజకీయ పార్టీ

ప్రపంచంలో అత్యంత కీలకమైన రాజకీయ పార్టీగా బీజేపీని అభివర్ణించింది వాల్ స్ట్రీట్ జర్నల్.  2014, 2019లో వరుసగా అఖండ విజయం సాధించిన బీజేపీ మరోమారు వరుసగా మూడవసారి, హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సన్నద్ధమైనట్టు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఓవైపు లీడింగ్ ఎకనమిక్ పవర్ గా కూడా ఎదుగుతున్న భారత్ లో రాజకీయంగా సుస్థిర ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు ఈ పత్రిక పేర్కొనటం కాస్త విశేషమే.  పాశ్చాత్య మీడియా యావత్తూ ఎప్పుడూ బీజేపీ, ఆ పార్టీ విధానాలు, నాయకత్వాన్ని పదేపదే విమర్శించి, భూతద్దంలో చూపటమే పనిగా పెట్టుకుంది. అలాంటిది ఈ పత్రిక ఆ పాశ్చాత్య మీడియా రేఖను దాటి ఇలా క్షేత్రస్థాయి విషయాలను, ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ చేయటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  ముఖ్యంగా బీజేపీ, ఈ పార్టీ సిద్ధాంతాలను విశ్వసించే వారిలో ఈ వార్త సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

- Advertisement -

ఇండ-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ఎదుగుతున్న భారత్, జపాన్ తో సరిసమానంగా ఆర్థికాభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఈ పత్రిక అభివర్ణించటమే కాదు.. బీజేపీ విధానాలను సరిగ్గా ప్రపంచం అర్థం చేసుకోవటం లేదని పేర్కొనటం కాస్త ఆసక్తికరమైన విషయంగా మారింది.  భారత్ మద్దతు లేకుండా చైనాకు మూకుతాడు వేయటం అమెరికాకు అసాధ్యమని కూడా ఈ పత్రిక కుండబద్ధలు కొట్టింది.

హిందుత్వం, ఆధునీకరణ రెండింటినీ బీజేపీ రెండు చేతుల్లో మోసుకెళ్తోందని వివరించింది.  సంప్రదాయ విధానాలతోపాటు ఆధునిక పద్ధతులు కలగలిపి గ్లోబల్ సూపర్ పవర్ గా దూసుకుపోయే క్రమంలో భారత్ పరుగులు పెడుతోందని పేర్కొంది.  200 మిలియన్ల ముస్లిం జనాభా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి జనాదరణ అసామాన్యంగా పెరుగుతోందని, క్రిస్టియన్ మైనారిటీల ప్రాబల్యం ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇటీవలే బీజేపీ గట్టిగా పాగా వేయటం చూస్తుంటే అన్ని సామాజిక వర్గాలు బీజేపీ వెన్నంటే ఉన్నాయనే విషయం అవగత మవుతోందని పత్రికలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News