Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్DOGE: డోజ్ మాజీ ఉద్యోగిపై దాడి.. స్పందించిన ట్రంప్

DOGE: డోజ్ మాజీ ఉద్యోగిపై దాడి.. స్పందించిన ట్రంప్

Washington: వాషింగ్టన్‌ డీసీలో ఇటీవల చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన అమెరికాలో రాజకీయంగా కలకలం రేపింది. ట్రంప్, ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న ప్రాజెక్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) కి చెందిన మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ కోరిస్టైన్‌ పై దాడి జరిగింది. ఈ దాడి పలు రాజకీయ, సామాజిక ప్రశ్నలు వెలికి తీసింది.
2025 ఆగస్ట్ 3న రాత్రి సమయంలో, వాషింగ్టన్ డీసీలోని లోగన్ సర్కిల్ వద్ద ఎడ్వర్డ్ పై  దాడి జరిగింది. ఒక యువతిపై జరిగిన కార్‌జాకింగ్‌కు అడ్డుగా నిలవడానికి ఎడ్వర్డ్ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతనిపై దాడి జరిగింది. 15 సంవత్సరాలు ఉన్న సుమారు 10 మంది యువకులు కలిసి అతన్ని కొట్టారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అతని వద్ద ఉన్న ఐఫోన్ 16 ని దోచుకున్నారు. ఇద్దరు నిందితులను మెరీలాండ్ ప్రాంతంలో నుంచి గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Read more:https://teluguprabha.net/international-news/us-warns-indians-visa-overstay/

ఎడ్వర్డ్‌కు బిగ్ బాల్స్ అనే మారుపేరు ఉంది. అతను ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించిన డోజ్ అనే ప్రత్యేక విభాగంలో పనిచేసేవాడు. ఈ విభాగం ప్రభుత్వ వ్యవస్థలో సమర్థతను పెంపొందించడానికి ఏర్పాటైంది. ఎలాన్ మస్క్, ట్రంప్ కలిసి దీన్ని ప్రమోట్ చేశారు.

ట్రంప్ ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు. డీసీ దీనిని త్వరగా సరిదిద్దుకోకపోతే నగరాలను ఫెడరల్ నియంత్రణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వాషింగ్టన్‌ డీసీలో నేరాలు నియంత్రణలో లేవని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా లేకపోవడంతో నేరాలు హెచ్చుమీరుతున్నాయని చెబుతున్నారు. నిందితుల వయస్సు తక్కువ అయినప్పటికీ, వారిని వయోజనులుగా విచారించాలి అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.

Read more: https://teluguprabha.net/international-news/zelenskyy-alleges-pak-china-mercenaries-in-russia-army/

మస్క్ ట్వీట్ చేస్తూ కోరిస్టైన్‌ను హీరోగా అభివర్ణించారు. అతను ఓ యువతిని రక్షించడానికి ముందుకొచ్చాడు. మన దేశంలో ఇలాంటి ధైర్యవంతులు అవసరం  అన్నారు. ఆయన కూడా డీసీలో ఫెడరల్ జోక్యం అవసరమని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad