Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Luxury Yacht: ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక

Luxury Yacht: ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక

Luxury Yacht: మిలియన్ డాలర్ల నౌక ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే మునిగిపోవడం సంచలనంగా మారింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్‌ తీరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

- Advertisement -

మెడ్‌ యిల్మాజ్‌ షిప్‌యార్డ్‌లో ఈ నౌకను ఏర్పాటుచేశారు. దీని నిర్మాణానికి 1 మిలియన్‌ డాలర్లు. అంటే, భారత కరెన్సీలో దాదాపు రూ.8.74 కోట్లు పైమాటే ఖర్చయ్యింది. మంగళవారం కొంతమంది ప్రయాణికులు, సిబ్బందితో ఈ యాచ్ ప్రయాణం ప్రారంభమైంది. అయితే ట్రావెలింగ్ ప్రారంభించిన 15 నిమిషాల్లోనే అది సముద్రంలో మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. ఆ తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.  కాగా.. నౌక మునిగిపోతున్న నేపథ్యంలో దాని యజమాని, కెప్టెన్‌ నిరుత్సాహంతో ఉండిపోయాడు. ఈనేపథ్యంలో ఆయన చేసేదేమీ లేక సముద్రంలో దూకి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. నౌక మునిగిపోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదన్నారు. దీనిపై త్వరలోనే విచారణ చేపడతామన్నారు. మరోవైపు.. ఈ నౌక మునిగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నివేదికల ప్రకారం, ఈ నౌక నిర్మాణం మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో పూర్తయింది. గతేడాది ఈ యాచ్ నిర్మాణం ప్రారంభం కాగా.. ఇటీవలే అది పూర్తయ్యింది. 160 GT మోటార్ గల యాచ్..  స్టీల్, అల్యూమినియం సూపర్ స్ట్రక్చర్ కలిగి ఉంది. దీన్ని నిర్మించిన తర్వాత ఇస్తాంబుల్ నుండి దాని యజమానికి అందజేశారు.

 Read Also: Supreme Court: అక్రమంగా చెట్ల నరికివేత వల్లే.. ప్రకృతి విలయంపై సుప్రీంకోర్టు

మునిగిన ఫిషింగ్ బోట్

ఇలాంటి ఘటనే ఇటీవలే మరోటి జరిగింది. గత నెలలో న్యూయార్క్‌లోని షీప్‌హెడ్ బేలోని పీర్ 1 నుండి 11 మంది ప్రయాణికులతో ఉన్న ఫిషింగ్ బోట్ మునిగిపోయింది. బోట్ మునగడం ప్రారంభమైన వెంటనే NYPD హార్బర్ యూనిట్ విమానం.. బోట్ లో ఉన్న వారిని రక్షించింది. అందరు ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. కానీ, ఒక ప్రయాణికుడిని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నట్లు కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు.

Read Also: Revanth Reddy: క్రైసిస్ మేనేజ్ మెంట్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad