Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్White House : టిక్‌టాక్‌లో వైట్ హౌస్ అకౌంట్.. ట్రంప్ వైఖరిపై విమర్శలు!

White House : టిక్‌టాక్‌లో వైట్ హౌస్ అకౌంట్.. ట్రంప్ వైఖరిపై విమర్శలు!

White House : అమెరికా వైట్ హౌస్ టిక్‌టాక్‌లో అధికారిక ఖాతా ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జాతీయ భద్రతా కారణాలతో టిక్‌టాక్‌ను నిషేధించాలని చట్టం తెచ్చిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు అదే యాప్‌లో ఖాతా తెరవడం విడ్డూరంగా ఉంది. ‘@whitehouse’ ఖాతా ప్రారంభమై, “అమెరికా వి ఆర్ బ్యాక్! వాట్స్ అప్ టిక్‌టాక్?” అనే క్యాప్షన్‌తో 27 సెకన్ల వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ట్రంప్ మాట్లాడుతూ, “నేను మీ వాయిస్” అని చెప్పారు. గంటలోనే ఈ ఖాతాకు 4,500 మంది ఫాలోవర్లు రాగా.. మరి కాసేపట్లోనే 80 వేల ఫాలోవర్లకు చేరింది.

- Advertisement -

ALSO READ: Telangana : తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ నోటిఫికేషన్

టిక్‌టాక్‌పై నిషేధం విధించే చట్టం 2024లో ఆమోదం పొందింది అమెరికా ప్రభుత్వం. చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్‌ను అమెరికన్ సంస్థకు విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని చట్టం చెబుతోంది. ఈ గడువు సెప్టెంబర్ 17, 2025 నాటికి ముగుస్తుంది. ట్రంప్ మూడుసార్లు ఈ గడువును పొడిగించారు. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 75 రోజులు, ఆపై మరో రెండుసార్లు పొడిగించారు. ట్రంప్ వ్యక్తిగత టిక్‌టాక్ ఖాతాకు 110.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఎన్నికల రోజు తర్వాత ఆయన పోస్ట్ చేయలేదు.

ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, “ట్రంప్ సాఫల్యాలను ప్రజలకు చేరవేయడానికి అన్ని వేదికలనూ ఉపయోగిస్తాం” అని చెప్పారు. ఇక రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో టిక్‌టాక్ కీలకమని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. టిక్‌టాక్ సీఈవో షౌ జీ చూ ట్రంప్ ఆహ్వానంతో ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. విపక్షాలు ట్రంప్ వైఖరిని రాజకీయ ఒత్తిడిగా విమర్శిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad