ఎఫ్.బి.ఐ. అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధిపతిగా మనోడే అంటే భారతీయ మూలానున్న వ్యక్తి కాష్ పటేల్ ను ట్రంప్ సర్కారు నియమించింది. కాష్ పటేల్ పూర్తి పేరు కాశ్యప్ పటేల్. అమెరికాలో స్థిరపడ్డ గుజరాతీ భారతీయ దంపతులకు కాశ్యప్ పటేల్ జన్మించారు.
అమెరికన్స్ భద్రతే టాప్ ప్రయారిటీ
ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఎఫ్బీఐ డైరెక్టర్ గా కాష్ పటేల్ బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికన్లకు హాని తలపెడితే అస్సలు సహించను అంటూ ఇప్పటికే ప్రకటించిన కాష్ గురించి ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాను అమలు చేయగల సత్తా ఉన్న వ్యక్తిగా కాష్ పటేల్ కు మంచి ఇమేజ్ ఉండటం విశేషం.

భద్రతా సలహాదారుగా పనిచేసిన అనుభవం
1980లో న్యూయార్క్ లో పుట్టి, ఆఫ్రికా తూర్పు ప్రాంతంలో కాష్ బాల్యం గడిచింది. బ్రిటన్ లో లా గ్రాడ్యుయేట్ అయిన ఈయనకు జాతీయ భద్రతా సలహాదారుతో సహా పలు కీలక పదవులను గతంలో నిర్వహించిన అనుభవం ఉంది. ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి తనను వరించిందన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించిన సమయంలో కాష్ పటేల్ తన తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి తనలోని భారతీయతను చాటుకున్నట్టు ఇండియన్-అమెరికన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు.