Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్NASA: చంద్రుడి వైపు దూసుకెళ్తోన్న భారీ గ్రహశకలం.. భూమిపైనా ప్రభావం??

NASA: చంద్రుడి వైపు దూసుకెళ్తోన్న భారీ గ్రహశకలం.. భూమిపైనా ప్రభావం??

NASA About Asteroid 2024 YR4: అంతరిక్షంలో ఒక గ్రహశకలం 2032లో చంద్రుడి వైపు వేగంగా కదులుతోంది. ఈ విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహశకలం పేరు 2024 YR4 అని తెలిపారు. దీనిని నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. ఈ గ్రహశకలం పరిమాణం సుమారు 15 అంతస్తుల భవనం పరిమాణంలో ఉందని నాసా తెలిపింది. అయితే ఈ చంద్రుడిని ఢీ కొట్టే అవకాశం స్వల్పంగానే ఉందని వివరించారు. ఒకవేళ ఢీ కొడితే, దీని ప్రభావం భూమిపైనా పడుతుందని అంచనా వేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/chinas-satellite-phone-signals-help-operation-mahadev-to-track-pahalgam-terrorists/
చంద్రుడిని ఢీ కొట్టే ప్రమాదం?
ఈ 2024 YR4 గ్రహశకలం చంద్రుడిని ఢీ కొట్టే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. అయితే ఇది 2032లో చంద్రుడిని తాకనుందని చెబుతున్నారు. కానీ ఈ ప్రమాదం సంభవించే అవకాశం తక్కువేనని వివరించారు. ఒకవేళ గ్రహశకలం ఢీ కొట్టినట్లయితే చంద్రుడిపై గట్టి ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గ్రహశకలం ఢీ కొడితే భారీ విస్ఫోటనం ఏర్పడి, చంద్రుడి ఉపరితలంపై సుమారు 800 అడుగుల మేర భారీ గుంత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: https://teluguprabha.net/national-news/isro-all-set-to-launch-new-pslv-f16-today/

భూమి వైపు వస్తే పరిస్థితేంటి?
అలానే గ్రహశకలం ముక్కలైపోతుందని, ఆ ముక్కలు భూమి వైపు ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. ఈ ముక్కలైపోయిన శకలాలు భూ కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలకు పెద్ద ముప్పు కలిగించవచ్చని నాసా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భూమి చుట్టూ సుమారు 10,000కి పైగా యాక్టివ్ ఉపగ్రహాలు తిరుగుతున్నాయని, ఇంకా 25,000లపైగా అంతరిక్ష వ్యర్థాలు ఉన్నాయని నాసా పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రహశకలం ముక్కలు ఉపగ్రహాలకు హానికరం కావచ్చని వివరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad