Sunday, November 10, 2024
Homeఇంటర్నేషనల్Chinese Singer: కోవిడ్ టైంలో ఇలాంటి పని చేస్తావా.. చైనీస్ సింగర్‌పై నెటిజన్ల ఫైర్..!

Chinese Singer: కోవిడ్ టైంలో ఇలాంటి పని చేస్తావా.. చైనీస్ సింగర్‌పై నెటిజన్ల ఫైర్..!

Chinese Singer: చైనాలో కోవిడ్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో తెలిసిందే. అక్కడ ప్రతి వారం లక్షల్లో కోవిడ్ కేసులు నమోదువుతున్నాయి. రోజూ వేలల్లో మరణిస్తున్నారు. ఇలాంటి టైంలో ఎవరైనా తమకు కోవిడ్ రాకూడదనే కోరుకుంటారు. కానీ, ఒక చైనా సింగర్ మాత్రం కావాలని కోవిడ్ అంటించుకుంది. అంతేకాదు.. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

- Advertisement -

ఆమె చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పైగా దీనికి ఆమె చెప్పిన కారణం విని ఆమెపై మండిపడుతున్నారు. చైనాలో జేన్ ఝాంగ్ అనే యువతి గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. తన పాటలతో శ్రోతల్ని అలరిస్తుంటుంది. కొన్నిసార్లు ప్రైవేట్ ఈవెంట్స్‌లో కూడా ప్రదర్శనలిస్తుంది. కాగా, ఇటీవల ఆమె కావాలని కోవిడ్ బారిన పడింది. చైనా ప్రజలంతా తమకు కోవిడ్ ఎక్కడ సోకుతుందో అని భయపడుతుంటే, జేన్ మాత్రం కావాలని కోవిడ్ అంటించుకుంది.

చైనాలో కోవిడ్ సోకిన కొన్ని ప్రాంతాల్లో తిరిగింది. మాస్క్ లేకుండా, ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే తిరిగింది. దీంతో ఆమె కోరుకున్నట్లే త్వరగానే కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు ఒక రోజుపాటు కోవిడ్ లక్షణాలున్నట్లు చెప్పింది. తాను ఎందుకు కరోనా బారిన పడాలనుకుందో వెల్లడించింది. అయితే, ఆమె కావాలని కోవిడ్ అంటించుకోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పైగా ఆమె చెప్పిన కారణం విని ఇంకా ఆమెను తిడుతున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు కోవిడ్ బారిన పడాలనుకుందంటే.. రాబోయే కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న చైనాలో ఆమె సంగీత ప్రదర్శన ఉంది.

అంటే పబ్లిక్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల కరోనా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో, ఈమె ప్రదర్శన ఇచ్చే టైంలో కరోనా బారిన పడక తప్పదు. అయితే, సంగీత ప్రదర్శన ఇచ్చే టైంలో కరోనా వస్తుందా.. రాదా అని టెన్షన్ పడే బదులు.. ముందుగానే కరోనా తెచ్చుకుంటే బాగుంటుందని అనుకుంది. దీనివల్ల కరోనా సోకి, తన ప్రదర్శనకు ముందే తగ్గిపోతుందని భావించింది. దీంతో సంగీత ప్రదర్శన టైంలో ఎలాంటి భయం లేకుండా పాడొచ్చనుకుంది. అంతే.. కరోనా ఉన్న ఏరియాల్లో తిరిగి కోవిడ్ బారిన పడింది.

సంతోషంగా ఆ విషయాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. నెటిజన్లు మాత్రం ఆమె చేసిన పనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక పక్క ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే, జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. కావాలని కరోనా అంటించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో జేన్ ఝాంగ్‌ స్పందించింది. తన సోషల్ మీడియాలో ఈ విషయం గురించిన పోస్టులు తీసేసింది. అందరికీ క్షమాపణలు చెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News