ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ టోమికో ఇతోకా(Tomiko Itooka) కన్నుమూశారు. జపాన్‌కు చెందిన ఆమె(116) వృద్ధాప్య సమస్యలతో డిసెంబరు 29న మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె 1908 మే 23న ఒసాకోలో జన్మించారు. గతేడాది మేలో ఇతోకా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం గత ఏడాది స్పెయిన్ దేశస్థురాలైన బ్రన్యాస్(117) మృతి చెందారు. దీంతో అత్యంత వృద్ధ మహిళగా ఇతోకా నిలిచారు.
- Advertisement -
20 ఏళ్లకే వివాహం చేసుకున్న ఈమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. 1979లో భర్త చనిపోయినప్పటి నుంచీ ఒంటరిగానే జీవనం సాగించారు. కాగా సుమారు 3,067 మీటర్ల ఎత్తయిన ఆన్‌టేక్ శిఖరాన్ని ఆమె రెండు సార్లు అధిరోహించి రికార్డు సాధించారు.