Xi Jinping: ఆసియా దేశాలపై అమెరికా సుంకాల బెదిరింపులు తీవ్రతరంగా మారాయి. ఇలాంటి వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. శాంతా-యుద్ధమా, చర్చలా-ఘర్షణా.. ఏం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ (Japan)పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా.. సైనిక కవాతు సహా ఆయుధ ప్రదర్శన ఏర్పాటుచేసింది. ఈక్రమంలో తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామగ్రిని ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి 26 దేశాల నేతలు హాజరయ్యారు. ప్రతిష్ఠాత్మక తియానన్మేన్ స్క్వేర్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, దేశం సైనిక సామర్థ్యాలను మరింత పెంచుతామని ఈసందర్భంగా చైనా అధ్యక్షుడు ప్రతిజ్ఞ చేశారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని రక్షించడంలో సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఈసందర్భంగా తైవాన్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. అది తమ దేశంలో భాగమని బీజింగ్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ప్రస్తుతం అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక, ఈ కార్యక్రమంలో చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్, రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ హాజరయ్యారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పాల్గొన్నారు.
Read Also: Earthquake: అఫ్గాన్ ను వణికిస్తున్న వరుస భూకంపాలు..!
ట్రంప్ విమర్శల వేళ
మరోవైపు, ఈ కార్యక్రమంలో జిన్‌పింగ్‌తో పాటు పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin), ఉత్తరకొరియా నాయకుడు కిమ్‌జోంగ్ ఉన్ (Kim Jong Un) గురించి ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ ముగ్గురు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రెండో ప్రపంచయుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలన్నారు. యుద్ధం నేపథ్యంలో చైనాకు మద్దతిచ్చి, ప్రాణత్యాగం చేసిన అమెరికన్ సైనికులను జిన్‌పింగ్ గుర్తిస్తారా..? లేదా..? అనేది పెద్ద ప్రశ్న అని ట్రంప్ అన్నారు. ఈ తరుణంలో జిన్‌పింగ్ నుంచి స్పందన వచ్చింది.
Read Also: Manoj Jarange: డిమాండ్లకు మహా సర్కారు ఆమోదం.. జరాంగే విజయ ప్రకటన


