యెమెన్ దేశంలో జరిగిన తొక్కిసలాట ఇప్పటికే 85 మంది ప్రాణాలు తీసింది. ఇంకా చాలామంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కడు పేదదేశమైన యెమెన్ లో రంజాన్ సాయంలో ఈ భారీ తొక్కిసలాట జరిగింది. ఇక గాయపడ్డవారి సంఖ్య వందల్లో ఉందని ఆ దేశం వెల్లడించింది. 322 మంది గాయపడగా వారిలో చాలామంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరణించినవారిలో అత్యధికులు మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్టు హుతి సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు.




