Trump’s Son vs Bill Clinton’s Daughter: వైట్ హౌస్ ఈస్ట్ వింగ్‌ను కూల్చివేయడంపై అమెరికా అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ మధ్య ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మాటల యుద్ధం జరిగింది. $300 మిలియన్ల వ్యయంతో కొత్త బాల్‌రూమ్ నిర్మాణానికి మార్గం సుగమం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈస్ట్ వింగ్‌ను కూల్చివేయడాన్ని చెల్సియా క్లింటన్ తీవ్రంగా విమర్శించారు.
ALSO READ: H1B Visa Fee Hike : H1B వీసా ఫీజు పెంపు! అమెరికాలో దిక్కుతోచని స్థితిలో భారతీయ డాక్టర్లు!
అమెరికన్ వారసత్వంపై దాడి
చెల్సియా క్లింటన్ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో స్పందిస్తూ, “నేను పన్నెండేళ్లప్పుడు వైట్ హౌస్ నా ఇల్లు అయింది. కానీ అది నా సొంత ఇల్లు కాదు, అది ప్రజల ఇల్లు అని నాకు తెలుసు,” అని అన్నారు.
The White House became my home when I was twelve years old. I always understood that it wasn’t my ‘house’; it was The People’s House. https://t.co/4nwSllGaRj
— Chelsea Clinton (@ChelseaClinton) October 23, 2025
ఈస్ట్ వింగ్‌ను కూల్చివేయడం అనేది కేవలం మార్బుల్ లేదా ప్లాస్టర్‌కు సంబంధించిన విషయం కాదని, ఇది అమెరికన్ వారసత్వం, ప్రజాస్వామ్య విలువలపై అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న దాడి అని ఆమె పేర్కొన్నారు.
పాత ఆరోపణలు, కుమారుడి కౌంటర్
దీనికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గట్టిగా బదులిచ్చారు. “మీ తల్లిదండ్రులు వైట్ హౌస్ నుంచి ఫర్నిచర్, సిల్వర్ వేర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించారు. ఆ విషయంపై మాట్లాడకండి,” అంటూ 2001 నాటి ఆరోపణలను ప్రస్తావించారు.
Lol, your parents tried stealing furniture and silverware from the White House… and let’s not talk about the intern. Sit this one out. https://t.co/c7wFVkLXTs
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) October 24, 2025
2001లో వైట్ హౌస్ నుంచి వైదొలిగేటప్పుడు క్లింటన్ దంపతులు $28,000 విలువైన ప్రభుత్వ వస్తువులను తీసుకువెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. వాటిని వ్యక్తిగత బహుమతులుగా భావించామని, విషయం తెలిసిన వెంటనే తిరిగి ఇచ్చేశామని క్లింటన్ దంపతులు వివరణ ఇచ్చి, దానిని అపార్థంగా పేర్కొన్నారు.
అంతేకాక, ట్రంప్ జూనియర్, బిల్ క్లింటన్ మాజీ వైట్ హౌస్ ఇంటర్న్ మోనికా లూయెన్స్కీతో సంబంధం పెట్టుకున్న ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ, “ఇంటర్న్ గురించి మాట్లాడకండి. ఈ విషయంలో మీరు దూరంగా ఉండండి,” అని ట్వీట్ చేశారు.
“ప్రతి అధ్యక్షుడు, ప్రథమ కుటుంబం కాలక్రమేణా వైట్ హౌస్‌లో మార్పులు చేస్తారు. అయితే, ఆ మార్పులు ఎలా చేస్తున్నారు, చరిత్రను గౌరవిస్తున్నారా, ప్రజలను పరిగణలోకి తీసుకుంటున్నారా అనేది ముఖ్యం,” అని చెల్సియా క్లింటన్ యుఎస్‌ఏ టుడేకి రాసిన అభిప్రాయ వ్యాసంలో పేర్కొన్నారు.
ALSO READ: Donald Trump: ట్రంప్ మరో కొత్త రూల్.. ఇకపై, అమెరికాలోకి ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో ఫోటోలు..!


