మీకు పానీ పూరీ అంటే ఇష్టమా? అయితే లైఫ్ టైంకి ఫ్రీ పానీ పూరీ తినచ్చని బంపర్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో పానీ పూరీకి ఉన్నంత డిమాండ్ మరే స్నాక్స్ కు ఉండదు కాబట్టి పానీ పూర్ మీల్ మొదలు ఇన్స్టంట్ పానీ పూరీ వరకూ రోజూ కొన్ని మిలియన్ డాలర్ల పానీ పూరీ వ్యాపారం సాగుతుంది.
ఎవరు బతికున్నంత కాలమో?
అందుకే నాగపూర్ కు చెందిన ఓ పానీపూరీ వ్యాపారి ఒకే లైఫ్ టైం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చి, తెగ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నాడు. జస్ట్ 99 వేలు కట్టండి చాలు నా దగ్గర లైఫ్ టైంకి ఎన్ని గోల్ గప్పాలైనా తినండి అని బోర్డు పెట్టేశాడు. ఇంకేముంది ఈ న్యూస్ కాస్త వైరల్ అయిపోయింది. దీనిపైన సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై సాగుతున్న డిస్కషన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అసలు ఈ ప్యాకేజ్ అంతా కస్టమర్ బతికున్నంత కాలమా? లేక పానీ పూరీ అమ్మే వ్యక్తి లైఫ్ టైంకా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయినా డబ్బు కట్టి ఆఫర్ తీసుకున్నా సపోజ్ ఈ వ్యాపారి బోర్డు తిప్పేసి పోతే నా సంగతేంటి? అని మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు.
మరి పుచ్కాలా మజాకానా
అన్నట్టు పానీ పూరీకి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంటుంది కొన్ని చోట్ల వీటినే గోల్ గప్పా అంటే మరికొన్ని చోట్ల మాత్రం దీన్ని పుచ్కా అని పిలుస్తారు.