30-Day Rule Trend: డబ్బులు పొదుపు చేసేందుకు ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ వైరల్ అవ్వటం సహజమే. అలాంటి ఓ ట్రెండే 30 డేస్ రూల్. మీరు మనసుపడ్డ వస్తువును తక్షణం కొనేయకుండా ఓ 30 రోజుల పాటు వేచి చూడాలి. 30 రోజుల తరువాత కూడా ఆ వస్తువు కొనాలనిపించినా, కొనాల్సిన అవసరం ఉన్నట్టు అర్థమైతేగానీ ఆ వస్తువును కొనద్దు. దీంతో మీరు కేవలం టెంప్టేషన్తో వస్తువులను కొనకుండా మీకు నచ్చిన, అవసరమైన వస్తువులు మాత్రమే కొంటారు. ఇలా చేసే క్రమంలో భారీగా డబ్బు ఆదా అవుతుంది కూడా. సరదాగా ఆన్లైన్ షాపింగ్ చేసేస్తూ అనవసరమైన వస్తువులను పోగేసుకోవడం మనవాళ్లకు బాగా అలవాటైన నేపథ్యంలో ఇలాంటి ఫైనాన్షియల్ రూల్స్ కూడా ట్రెండింగ్లోకి వస్తున్నాయి. ఇలా కనీసం 30 రోజులు వస్తువు కొనకుండా ఉండే క్రమంలో ఆ వస్తువుకు ప్రత్యామ్నాయాలు, ఆఫర్లు, బడ్జెట్ వంటి చాలా అంశాలపై మీకు సంపూర్ణ స్పష్టత వచ్చి, డబ్బు వృథా కాకుండా సురక్షితంగా ఉంటుంది.
Also Read: Almond Milk Nails: ప్రియాంక చోప్రా స్టైల్తో వైరల్.. ఆల్మండ్ మిల్క్ నెయిల్స్ ట్రెండ్

