Herbal Teas for Liver: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. అయితే, వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారం పట్ల నిర్లక్ష్యం కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు తరచుగా ప్రజలను వాటి బాధితులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వీటిలో ఒకటి. ఇది ఎంతో వేగంగా వ్యాపిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడం ముఖ్యం. అయితే, ఆహారంలో ఈ 5 హెర్బల్ టీలను చేర్చుకుంటే అది మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.
పసుపు టీ
ప్రతి వంటకంలో పసుపు వాడుతాం. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో ఉండే కర్కుమిన్ దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కావున పసుపు టీ తాగడం వల్ల కాలేయ వాపు తగ్గుతుంది. శరీరం నిర్విషీకరణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
షిసాండ్రా బెర్రీ టీ
షిసాండ్రా బెర్రీ ఒక సాంప్రదాయ చైనీస్ పండు. దీని ప్రత్యేకమైన ఏంటంటే రుచికి ప్రసిద్ధి చెందింది. ఈ బెర్రీలు మన శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి, సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. షిసాండ్రా బెర్రీ టీ తాగితే కాలేయ నిర్విషీకరణ జరగడమే కాకుండా మన శక్తి స్థాయి కూడా పెరుగుతుంది.
మిల్క్ తిస్టిల్ టీ
ఇది ఒక పురాతన హెర్బల్ టీ. ఇందులో ఉపయోగించే సిలిమారిన్, దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలకు ప్రసిద్ధి చెందిన సమ్మేళనం. దీని తాగితే కాలేయాన్ని విష పదార్థాల నుండి రక్షిస్తుంది. దెబ్బతిన్న కాలేయ కణాలను మరమ్మతు చేయడంలోనూ సహాయపడుతుంది.
లైకోరైస్ రూట్ టీ
లైకోరైస్ రూట్ విలక్షణమైన తీపి రుచితో ఆయుర్వేద, సాంప్రదాయ చైనీస్ వైద్యం రెండింటిలోనూ ఉపయోగిస్తారు. ఇందులో ఉండే గ్లైసిరైజిన్ శోథ నిరోధక, కాలేయ-రక్షణ ప్రభావాలను కలిగి ఉంటుంది. దీని రూట్ టీ తాగడం వల్ల కాలేయ వాపు తగ్గుతుంది. నిర్విషీకరణ ప్రక్రియ మెరుగుపడుతుంది.
డాండెలైన్ రూట్ టీ
డాండెలైన్ సాధారణంగా కలుపు మొక్కగా పరిగణిస్తారు. అయితే, ఇది కాలేయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీని వేర్లు శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. డాండెలైన్ రూట్ టీ తాగడం వల్ల శరీరంలోని అదనపు వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.