Saturday, November 15, 2025
HomeTop StoriesDiabetes: మధుమేహానికి నిద్రతో చెక్..

Diabetes: మధుమేహానికి నిద్రతో చెక్..

Sleep For Diabetes: ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ముఖ్యంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రబలంగా ఉంది. భారతదేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు.

- Advertisement -

చాలామంది మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా కొందరిలో మధుమేహం అదుపులోకి రాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డయాబెటిస్ తో బాధపడుతూనే ఉంటారు. అయితే, దీనికి నిద్రలేమి కూడా ఓ ప్రధాన కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొంతకాలం పాటు HbA1c స్థాయుల్లో (రెండు, మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయి) ఎటువంటి తగ్గుదల లేని కొందరు మధుమేహ వ్యాధిగ్రస్తులపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు రోజూ కచ్చితంగా ఏడు గంటల పాటు నిద్రపోతే చక్కెర లెవెల్స్‌ సాధారణ స్థాయికి చేరుకుంటాయని చెబుతున్నారు.

also read:Custard Apple: మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే.. సీతాఫలం జోలికి అసలు వెళ్లకండి!

ఈ అధ్యయనాలు సరైన నిద్ర లేకపోతే గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్, హార్మోన్ నియంత్రణకు అంతరాయం కలిగిస్తుందని వెల్లడిస్తున్నాయి. అదనంగా, నిద్ర లేకపోవడం శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఇవి ఆకలి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. సరైన నిద్ర కార్టిసాల్ పెరుగుదలను నియంత్రిస్తుంది. శరీరానికి గ్లూకోజ్‌ను నియంత్రించడానికి, కణజాలాలను మరమ్మతు చేయడానికి, జీవక్రియ సమతుల్యతను కాపాడుకోవడానికి అవసరమైన సమయాన్ని కేటాయించడానికి అనుమతిస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి, కణాలు గ్లూకోజ్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొనడం, పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, ప్రశాంతమైన నిద్ర కోసం బెడ్ రూమ్‌ను చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం, పడుకునే ముందు తక్కువ ఆహారం తీసుకోవడం, సరళమైన జీవనశైలిని నడిపించడం దీనికి సహాయపడతాయని అధ్యయనం పేర్కొంది. శరీరానికి తగినంత విశ్రాంతి లభించినప్పుడు, ఇతర పనులు చేయడం, వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. వీటి కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పరోక్షంగా నియంత్రణలోకి వస్తుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad