Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Quiz Ideas On Independence Day: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా... మీ తెలివితేటలకు పరీక్ష!

Quiz Ideas On Independence Day: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా… మీ తెలివితేటలకు పరీక్ష!

Quiz On Independence Day 2025: భారతదేశ స్వాతంత్ర దినోత్సవం స్వేచ్ఛకు, శాంతికి, స్వాతంత్ర సమరయోధుల పోరాటంకు చిహ్నం. ఈ జాతీయ పండుగను ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఇతర సంస్థలలో జాతీయ జెండాను ఎగురవేసి, దేశభక్తి గీతాలు పాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా వేడుకలు జరుపుతారు. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మన దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం గురించి మీకున్న జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఒక సింపుల్ క్విజ్ మీకోసం సిద్ధం.

- Advertisement -

భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది?

  • (a) ఆగస్టు 15, 1947
  • (b) జనవరి 26, 1950
  • (c) ఆగస్టు 14, 1947
  • (d) ఆగస్టు 15, 1950

ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారు?

  • (a) రాష్ట్రపతి
  • (b) ప్రధాని
  • (c) లోక్‌సభ స్పీకర్
  • (d) ఉపరాష్ట్రపతి

మన భారత జాతీయ పతాకాన్ని రూపొందించినవారు ఎవరు?

  • (a) మహాత్మా గాంధీ
  • (b) జవహర్‌లాల్ నెహ్రూ
  • (c) పింగళి వెంకయ్య
  • (d) భగత్ సింగ్

స్వతంత్ర భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరు?

  • (a) మహాత్మా గాంధీ
  • (b) సర్దార్ వల్లభాయ్ పటేల్
  • (c) జవహర్‌లాల్ నెహ్రూ

(d) డా. బి.ఆర్. అంబేద్కర్

‘స్వాతంత్రం నా జన్మహక్కు’ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?

  • (a) బాల గంగాధర తిలక్
  • (b) భగత్ సింగ్
  • (c) లాలా లజపత్ రాయ్
  • (d) సుభాష్ చంద్రబోస్

జాతీయ జెండాలోని అశోక చక్రం ఏ రంగులో ఉంటుంది?

  • (a) ఎరుపు
  • (b) ఆకుపచ్చ
  • (c) ముదురు నీలం

(d) కాషాయం

‘భారతదేశ ఉక్కు మనిషి’ అని ఎవరిని పిలుస్తారు?

  • (a) భగత్ సింగ్
  • (b) సర్దార్ వల్లభాయ్ పటేల్
  • (c) జవహర్‌లాల్ నెహ్రూ

(d) సుభాష్ చంద్రబోస్

“మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రని ఇస్తాను” అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?

  • (a) మహాత్మా గాంధీ
  • (b) బాల గంగాధర తిలక్
  • (c) చంద్రశేఖర్ ఆజాద్

(d) సుభాష్ చంద్రబోస్

జలియన్‌వాలా బాగ్ దుర్ఘటన జరిగిన అమృత్‌సర్ పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది?

  • (a) ఉత్తరప్రదేశ్
  • (b) పంజాబ్
  • (c) హర్యానా
  • (d) గుజరాత్

1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?

  • (a) లార్డ్ కర్జన్
  • (b) లార్డ్ మౌంట్‌బాటెన్
  • (c) లార్డ్ వెల్లస్లీ
  • (d) లార్డ్ లిన్‌లిత్‌గో

జవాబు: 1 (a), 2 (b, 3. (c), 4 (c), 5 (a), 6 (c), 7 (b), 8 (d), 9 (b), 10 (d)

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad