Monday, April 14, 2025
Homeలైఫ్ స్టైల్ఏసీ వాడుతున్నారా.. ఇలా చేస్తే 50శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు..!

ఏసీ వాడుతున్నారా.. ఇలా చేస్తే 50శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. దీంతో ఈ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ప్రజలు విస్తృతంగా ఏసీ, కూలర్లపై ఆధారపడుతున్నారు. అయితే ఈ అధిక వినియోగం కరెంటు బిల్లుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఏసీ వాడకాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుని విద్యుత్తును ఆదా చేసుకోవడానికి కొన్ని టిప్స్‌ ను పాటించడం ఎంతో అవసరం. ఇవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

సాధారణంగా ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద నడిపితే చల్లదనం ఎక్కువగా వస్తుందనేది చాలా మందికి ఉండే అపోహ. అసలు నిజం ఏమిటంటే 24 డిగ్రీల ఉష్ణోగ్రతే శరీరానికి అనుకూలం అని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) చెబుతోంది. ఒక్కో డిగ్రీ తక్కువ ఉష్ణోగ్రత పెడితే సుమారు 6 శాతం విద్యుత్ ఖర్చు పెరుగుతుంది. ఇక గత సీజన్‌ తరువాత ఏసీని సర్వీస్ చేయకుండా నేరుగా ఆన్ చేస్తే, దుమ్ము గాలికి ఆటంకంగా మారుతుంది. దాంతో చల్లదనం తక్కువగా వస్తుంది. ఇలా జరిగితే మీరు ఉష్ణోగ్రతను ఇంకా తగ్గించి బాగా ఖర్చు పెంచుతారు. కాబట్టి ఏసీను వాడేముందు ఒకసారి సర్వీస్ చేయించుకోవడం మంచిది.

ఏసీ ఆన్ చేసే ముందు తలుపులు, కిటికీలు మూసి వేయండి. చల్లని గాలి బయటకు పోకుండా, వేడి గాలి లోపలికి రాకుండా చూడండి. దీంతో ఏసీ ఎక్కువ శ్రమపడకుండానే గదిని చల్లగా ఉంచుతుంది.
ఇప్పటి ఏసీల్లో సాధారణంగా స్లీప్ మోడ్ ఫీచర్ ఉంటుంది. ఇది రాత్రిపూట తేమ, ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల సుమారుగా 36 శాతం విద్యుత్ ఆదా చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

ఏసీతో పాటు ఫ్యాన్ వాడితే, గాలి సమంగా గదిలో ప్రసరిస్తుంది. దీంతో చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. అలాగే, ఏసీ ఆన్ చేయకముందే ఫ్యాన్ ఆన్ చేస్తే, గది వేడి కొంత తక్కువ అవుతుంది. దీనివల్ల మీరు ఏసీ ఉష్ణోగ్రతను అధికంగా తగ్గించాల్సిన అవసరం ఉండదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News