Hair Tips: ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద వారిలో జుట్టు బలహీనంగా మారడం, జట్టు రాలడం వంటి సమస్యలు సర్వసాధారణం. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా కారణాలు. అయితే, చాలామంది ఈ సమస్యలకోసం మార్కెట్లో లభించే ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు వాడుతుంటారు. కానీ, అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వవు. ఇటువంటి పరిస్థితిలో మనం డైలీ వాడే కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలను కలిపి వాడితే ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇవి జుట్టు మూలాలను పోషించడమే కాకుండా వాటికి సహజ మెరుపును కూడా అందిస్తాయి.
నిమ్మరసం:
చుండ్రు త్వరగా తొలగిపోవాలంటే కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు అప్లై చేయాలి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ తలపై చర్మాన్ని సులభంగా శుభ్రపరుస్తుంది. ఇది తలపై ఉన్న జిడ్డు ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికి 1 నుండి 2 సార్లు తలకు పూయడం వల్ల జుట్టు తేలికగా, మెరిసేలా కనిపిస్తుంది.
Also read: Ayurvedic Lifestyle for glowing skin: చర్మాన్ని మెరిపించే లైఫ్ స్టైల్ చిట్కాలు
కలబంద జెల్:
కలబంద జుట్టు ఆరోగ్య సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తలకు చల్లదనాన్ని అందిస్తాయి. అంతేకాదు, జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి. ఈ మిశ్రమం కోసం కొబ్బరి నూనెలో 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ కలిపి జుట్టు మూలాలపై మసాజ్ చేయాలి. దీని వల్ల పొడి జుట్టు మృదువుగా ఉంటుంది.
ఉసిరి పొడి:
జుట్టు బలంగా, మెరిసేలా చేయడానికి ఆమ్లా పొడి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం కొబ్బరి నూనెలో 1 టీస్పూన్ ఆమ్లా పొడిని మిక్స్ చేసి, కొద్దిగా వేడి చేయాలి. ఆపై జుట్టు మూలాలపై అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెంతి గింజలు:
మెంతి గింజలలో ప్రోటీన్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారించి కొత్త జుట్టు పెరగడానికి ఎంతో సహాయపడతాయి. ఈ మిశ్రమం కోసం కొబ్బరి నూనెలో రాత్రంతా నానబెట్టిన మెంతి గింజల పేస్ట్ మిక్స్ చేసి, కాస్త వేడి చేయాలి. తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఇది జుట్టును కుదుళ్ల నుండి బలపరుస్తుంది. అంతేకాదు వాటికి సహజమైన మెరుపును అందిస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


