Turmeric Face Pack: చాలామంది చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ఫలితంగా వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు కూడా ఉండవు. పైగా వీటి రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి కూడా! ఇటువంటి పరిస్థితుల్లో ముఖంపై సహజ మెరుపు కోసం పసుపు ఫేస్ ప్యాక్ ఉపయోగించడం ఉత్తమం. ఇది చర్మం నుండి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను తొలగించి కొత్త మెరుపును తెస్తుంది. అంతేకాదు, పసుపులో పాలు, తేనె కలిపి ముఖానికి పూసుకుంటే, చర్మం మెరుపు రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలోనే పసుపు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి? ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలి?పసుపు ఫేస్ ప్యాక్ వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.
పసుపు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావలసినవి
1. 1 టీస్పూన్ పసుపు
2. 1టేబుల్ స్పూన్ పాలు
3. 1 టీస్పూన్ తేనె
Also Read: Sweet Potato: చిలగడదుంపతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
పసుపు ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేసే విధానం
పసుపు ఫేస్ ప్యాక్ చర్మం పాత మెరుపును తిరిగి అందిస్తుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఈ పసుపు ఫేస్ ప్యాక్ తాయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ పసుపును వేయాలి. తర్వాత దానికి పాలు, తేనె జోడించాలి. ఇప్పుడు ఈ మూడింటిని పేస్ట్ లాగా తయారయ్యే వరకు బాగా కలపాలి. అనంతరం ముఖానికి ఈ పసుపు ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు, తేలికపాటి ఫేస్ వాష్ చేసి ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. దీని తరువాత ముఖాన్ని చేతులతో నీరు ఉండకుండా తుడవాలి. ఇప్పుడు తయారుచేసిన పేస్ట్‌ను బ్రష్ లేదా వేళ్ల సహాయంతో ముఖం, మెడపై సమానంగా అప్లై చేయాలి. దాదాపు 20 నిముషాలు ముఖం పై వేసిన పసుపు ఫేస్ ప్యాక్ అలానే ఉంచాలి. దీనివల్ల పసుపు ఫేస్ ప్యాక్‌లో ఉన్న లక్షణాలు చర్మంలోకి బాగా చొచ్చుకుపోతాయి. నిర్ణీత సమయం తర్వాత, ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
పసుపు ఫేస్ ప్యాక్ వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. ముఖంపై సహజ మెరుపు వస్తుంది.
2. మొటిమల సమస్య తగ్గడం ప్రారంభమవుతుంది.
3. ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
4. సూర్యకాంతి వల్ల కలిగే టానింగ్ తగ్గుతుంది.
5. వయస్సు కారణంగా వచ్చే ముడతలు తగ్గుతాయి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


