Homeలైఫ్ స్టైల్Almond Milk Nails: ప్రియాంక చోప్రా స్టైల్‌తో వైరల్.. ఆల్మండ్ మిల్క్ నెయిల్స్ ట్రెండ్

Almond Milk Nails: ప్రియాంక చోప్రా స్టైల్‌తో వైరల్.. ఆల్మండ్ మిల్క్ నెయిల్స్ ట్రెండ్

Almond Milk Nails: బ్యూటీ, నెయిల్ ఆర్ట్ రంగంలో రోజుకో కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందుతున్న ట్రెండ్ ‘ఆల్మండ్ మిల్క్ నెయిల్స్’. సింపుల్‌గా కనిపిస్తూనే ఎలిగెంట్ లుక్‌ను అందించే ఈ నెయిల్ స్టైల్ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలతో పాటు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. బాదం పాల రంగును పోలి ఉండే మృదువైన మిల్కీ న్యూడ్ షేడ్స్‌తో రూపొందించే ఈ నెయిల్ ఆర్ట్‌ను ‘మిల్కీ న్యూడ్ మానిక్యూర్’ అని కూడా పిలుస్తారు.

- Advertisement -

చేతులకు సహాజమైన అందం
ఇది చేతులకు సహజమైన అందాన్ని తీసుకురావడంతో పాటు స్టైలిష్, క్లాసీ లుక్‌ను అందించడం దీని ప్రత్యేకత. ఆల్మండ్ ఆకారంలో గోళ్లను తీర్చిదిద్దిన తర్వాత గ్లాసీ ఫినిష్‌తో పాలిష్ చేయడం వల్ల గోర్లు మరింత ఆరోగ్యంగా, మెరిసేలా కనిపిస్తాయి. క్లాసిక్ వైట్, సాఫ్ట్ పింక్, లైట్ క్రీమ్, బీజ్, సెమీ-షీర్ మిల్కీ టోన్ వంటి షేడ్స్‌లో ఈ ట్రెండ్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా అన్ని రకాల చర్మ ఛాయలకు ఈ రంగులు సులభంగా సెట్ అవ్వడం దీనికి మరింత ఆదరణ తీసుకొస్తోంది.

Also Read: Almond Milk Nails: ప్రియాంక చోప్రా స్టైల్‌తో వైరల్.. ఆల్మండ్ మిల్క్ నెయిల్స్ ట్రెండ్

ప్రియాంక చోప్రాతో వైరల్‌
ఇటీవల జరిగిన వింబుల్డన్ టోర్నమెంట్‌కు హాజరైన ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కూడా ఆల్మండ్ మిల్క్ నెయిల్స్‌తో కనిపించడం ఈ ట్రెండ్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఆమె స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ నెయిల్ డిజైన్‌పై ఆసక్తి మరింత పెరిగింది. సింపుల్‌గా కనిపిస్తూనే ప్రీమియం లుక్‌ను అందించే ఈ నెయిల్ ట్రెండ్ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిరోజూ ఉపయోగించుకునే స్టైల్‌గా కూడా ఇది అనువుగా ఉండటంతో అన్ని వయసుల మహిళలు దీనివైపు ఆకర్షితులవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News