Homeలైఫ్ స్టైల్Aluminium foil Trend: అల్యూమినియం ఫాయిల్ ట్రెండ్

Aluminium foil Trend: అల్యూమినియం ఫాయిల్ ట్రెండ్

Aluminium foil trend: రాత్రంతా జుట్టుకు అల్యూమినియం ఫాయిల్ చుట్టుకుని పడుకోవటం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ గా మారింది. అల్యూమినియం ఫాయిల్ లో జుట్టును పాయలుగా చుట్టేసి రాత్రంతా నిద్రపోవటం బ్యూటీ హాక్ గా వైరల్ అవుతోంది. వెంట్రుకలు చిక్కు పడకుండా, జుట్టు పూర్తి రఫ్ కాకుండా ఉండేలా సిల్వర్ ఫాయిల్ పనిచేస్తుందనేది ఈ ట్రెండ్ వెనకున్న కారణం. దీంతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఫాయిల్ కురులను లాక్ చేస్తుంది కాబట్టి గాలి చొరబడకుండా వెంట్రులు పూర్తి పొడిబారకుండా తేమను లాక్ చేస్తుంది. దిండుకు రాసుకుని జుట్టు చిందరవందర అయిపోకుండా, వెంట్రుకలు చిట్లిపోకుండా ఈ అల్యూమినియం ఫాయిల్ సాయం చేస్తుంది. పైగా జుట్టు సిల్కీగా ఉండేలా కాపాడుతుంది. కర్లీ హెయిర్ ఏమాత్రం చెదరకుండా అలాగే ఉండిపోతుంది. కానీ ఇలా ఫాయిల్ ను ప్రతిరోజూ ట్రై చేయరాదు, చాలా అరుదుగా మాత్రమే ఈ ట్రిక్ అప్లై చేయవచ్చు. వెంట్రుకలు తమ సహజమైన గుణాలు కోల్పోకూడదంటే షవర్ క్యాప్ వాడటం ఉత్తమం కానీ ఇలా రోజూ ఫాయిల్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోవటంతో పాటు తలనొప్పి వరకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News