Bay Leaves Benefits: వంటగదిలో ఉండే ఆహార పదార్థాలలో బే ఆకులు కూడా ఒకటి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని తరచుగా కూరలు, బిర్యాని చేయడంలో వినియోగిస్తారు. ఇవి ఆహార రుచి, సువాసనను పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.ఆయుర్వేదంలో బే ఆకులను ఔషధ ఆకుగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్లు A, C, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి దగ్గు, అపానవాయువు, మధుమేహం, క్యాన్సర్, కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ క్రమంలో బే ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల ప్రయోజనాల ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
బే ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: బే ఆకులు డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. బే ఆకులను ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి బలపడుతుంది: బే ఆకులలో విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి జలుబు, వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు: ఈ ఆకులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది: బే ఆకుల వాసన మనస్సుకు విశ్రాంతినిచ్చే లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వాసన ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. అందుకే దీనిని అరోమాథెరపీలో కూడా ఉపయోగిస్తారు.
ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది: గ్యాస్, ఆమ్లత్వం లేదా అజీర్ణంతో బాధపడుతుంటే, బే ఆకు కషాయం తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. కడుపు చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం: బే ఆకు నీరు చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని, చుండ్రుని నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.


