Saturday, November 15, 2025
HomeTop StoriesBlack Eyed Peas: పిడికెడు గింజలు తింటే చాలు.. పుష్కలమైన లాభాలు..!

Black Eyed Peas: పిడికెడు గింజలు తింటే చాలు.. పుష్కలమైన లాభాలు..!

Black Eyed Peas: ఆహారం జీవ ఇంధనం లాంటిది. శరీరం ఆరోగ్యంతో ఉండాలన్నా, అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలన్నా అన్ని పోషక విలువలు కలిగిన సమతులాహారాన్ని క్రమంగా తీసుకొంటూ ఉండాలి.  మన శరీరం సజావుగా పని చేయడానికి 6 రకాల పోషకాలు అవసరం. అవి ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు. మన ఆహారంలో ఇవన్నీ సరిపడా ఉండేలా చూసుకోవాలి. అయితే, ఇలాంటివన్నీ బొబ్బర్ల‌లో ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిలో బోలెడ‌న్ని పోష‌క విలువ‌లు కూడా నిండి ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బొబ్బ‌ర్లు ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాలు కలిగిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా మ‌ధుమేహం ఉన్న వారు బొబ్బ‌ర్ల‌ను డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఊహిచని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. బొబ్బర్లలోని ఔషద గుణాలు, లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసకుందాం.

- Advertisement -

బొబ్బర్లలో పుష్కలంగా పోషకాలు..

బొబ్బర్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకాండా, విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి, ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటాయి. వీటిలో రాగి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్ వంటి మూలకాలు సైతం లభిస్తాయి. రోజూ ఒక క‌ప్పు బొబ్బ‌ర్ల‌ను నాన‌బెట్టి వాటిని ఉడికించి తింటే అనేక లాభాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు బొబ్బ‌ర్ల‌లో ఉంటాయి. వీటిని ఉడ‌క‌బెట్టి తింటే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది కడుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌దు. త‌క్కువ‌గా తింటారు. ఫలితంగా బరువుతగ్గుతారు.  శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం. మాంసకృత్తుల లోపము రాకుండా కాపాడుతుంది.  చేపనూనెలో ఉన్న గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో ఉన్నాయి. గుండె జబ్బు , మధుమేహము ఉన్నవారికి మంచిది. ఐరన్ , మెగ్నీషియం , కాల్సియం , ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి . థయామిన్ , రైబోఫ్లెవిన్, నియాసిన్ లాంటి విటమిన్లు ఉన్నాయి.

Read Also: Surya Grahan: చంద్రవంకగా ఆదిత్యుడి దర్శనం.. ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం స్పెషల్..

గర్భిణీలకు మేలు..

బొబ్బ‌ర్ల‌ వల్ల గర్భిణీలకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గ‌ర్భంలో శిశువు ఎదుగుద‌ల‌కు స‌హాయ ప‌డుతుంది. అంతే కాకుండా, అవి తినడం వల్ల ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. బొబ్బర్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేయ‌డంతోపాటు అంత‌ర్గ‌తంగా ఉండే వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బొబ్బర్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సిలు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో, మెరిసే, ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది.

Read Also: Baba Vanga astrology: గ్రహాంతరవాసులు భూమిపైకి ఎప్పుడు వస్తారో తెలుసా?

నియంత్రణలో బీపీ..

బొబ్బ‌ర్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. ఒక క‌ప్పు బొబ్బ‌ర్ల‌ను తిన‌డం వ‌ల్ల 194 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. ఈ ప‌ప్పును తింటే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బొబ్బ‌ర్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూరం చేస్తుంది.. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం తగ్గుతుంది. బొబ్బ‌ర్ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad