Eno good or Bad: ఈ మధ్యకాలంలో చాలామంది ఎసిడిటీ సమస్యతో తీవ్రంగా బాధపడడం చూస్తున్నాం. ఎసిడిటీగా ఉందని అనిపించగానే వెంటనే ఈనో ను కొనుగోలు చేసి తాగుతున్నారు. ఇది తాగడం వల్ల ఎసిడిటీ నుంచి వేగంగా ఉపశనం లభిస్తుంది. కానీ, ఎసిడిటీ సమస్యతో తరచూ ఈనోను తాగితే గట్ హెల్త్ దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనో తీసుకుంటే లాభాలు ఉన్నప్పటికీ, దాన్ని తరచూ వాడడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం రేకెత్తిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈనోను తరచుగా వినియోగించేవారు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలను కూడా వారు ఈ సందర్భంగా తెలిపారు.
ఈనోను తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా బలహీనపడుతుంది. ఎసిడిటీ అనేది ప్రధానంగా స్టోమక్ లో లో యాసిడ్ ఉత్పత్తివల్ల తలెత్తుతుంది. ఈనో విషయానికి వస్తే అది సోడియం బై కార్బోనేట్, సిట్రిక్ యాసిడ్ ల సమ్మేళనం. దీన్ని తాగడం వల్ల కేవలం కొద్ది సేపు మాత్రమే మనం ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని తరచుగా వాడితే మాత్రం ఇది స్టొమక్ కు దాని యాసిడ్ ఉత్పత్తిని తగ్గించుకోమని సిగ్నెల్ ఇచ్చినట్టు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Peas Vs Health: బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫూడ్
ఇలా తరచూ ఈనోను తాగడం వల్ల కొద్దికాలం తర్వాత వారి జీర్ణశక్తి తగ్గిపోతూ వస్తుందని నిపుణులు తెలిపారు. ఫలితంగా ఇలాంటివారు యాంటాసిడ్ల మీద ఎక్కువగా ఆధారపడవలసివస్తుందంటున్నారు. అత్యవసర సమయాల్లో ఈనో వినియోగం ఉపయోగకరం. కానీ, దీన్ని నిత్యం వాడడంవల్ల జీర్ణసంబంధిత తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని శిఖాగుప్త కాశ్యప్ వంటి పోషకాహారనిపుణులు సూచిస్తున్నారు.
మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటారా..? యాంటాసిడ్స్ తరచూ వాడకుండా ఎసిడిటీని తగ్గించే సింపుల్ ఇంటి చిట్కాను శిఖా సూచిస్తున్నారు. గోరువెచ్చని నీళ్లల్లో ఒక టీస్పూన్ యాపిల్ సిడార్ కలిపి స్ట్రాతో కొద్ది కొద్దిగా సిప్ చేస్తే ఎసిడిటీ నుంచి సాంత్వన పొందుతారంటున్నారు. మోడరేట్ పద్ధతిని అనుసరిస్తూ ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తడం కూడా తగ్గుతాయి.


