Sunday, April 13, 2025
Homeలైఫ్ స్టైల్Fuel : పెట్రోల్, డీజిల్, కన్నా విమాన ఇంధనం చవకంట.. లీటరు ఎంతో తెలుసా..?

Fuel : పెట్రోల్, డీజిల్, కన్నా విమాన ఇంధనం చవకంట.. లీటరు ఎంతో తెలుసా..?

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ.100 అవుతోంది.. డీజిల్ ధర కూడా అదే విధంగా పెరుగుతోంది.. అయితే విమానాల్లో వాడే ఇంధనం తక్కువ ధరకే లభిస్తోందన్న వాదన నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయం నిజమేనా..? విమానాల్లో అత్యుత్తమ ఇంధనాన్ని ఉపయోగిస్తారని అనుకుంటే, అది పెట్రోలుకంటే తక్కువ ధరలో ఎలా లభిస్తుంది? అనే సందేహం చాలా మందిలో ఉత్పన్నమవుతోంది.

- Advertisement -

అసలు విషయమేంటంటే, విమానాల్లో వాడే ఇంధనాన్ని “ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్” (ATF) అంటారు. ఇది ముడి చమురు (క్రూడ్ ఆయిల్) నుంచి శుద్ధి చేయబడే ఉత్పత్తుల్లో ఒకటి. ముడి చమురును శుద్ధి చేసే ప్రక్రియలో పెట్రోల్, డీజిల్, ATF వంటి పదార్థాలు వేరు అవుతాయి. అయితే వీటిలో ప్రతిదీ వేర్వేరు లక్షణాలతో ఉంటుంది. ATFకి తక్కువ ఫ్రీజింగ్ పాయింట్, ఎక్కువ ఫ్లాష్ పాయింట్ ఉంటుంది. అలాగే ఇది తక్కువ జిగటత కలిగి ఉంటుంది. ఇవన్నీ దీన్ని అధిక ఎత్తుల్లో, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తాయి. అందుకే విమానాల వంటి అధునాతన రవాణా సాధనాల్లో దీన్ని వాడతారు.

ధర తక్కువగా ఉండటానికి కారణాలేంటి: విమానాల్లో ఉపయోగించే ఇంధనంపై విధించే పన్నులు పెట్రోలుకు, డీజిల్‌కు ఉన్నవాటితో పోల్చితే చాలా తక్కువగా ఉంటాయి. దాంతో ATF ధర కూడా తక్కువగా ఉంటుంది. అంతేగాక, దీనిని శుద్ధి చేసే ప్రక్రియ కూడా పెట్రోలుతో పోల్చితే తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు. అంతేకాదు విమానాలకు అవసరమయ్యే ఇంధనం పెద్ద మొత్తంలో ముందుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఉదాహరణకి ఒక లీటరు పెట్రోల్ ధర రూ.100 ఉంటే, అదే సమయంలో ATF ధర రూ.58 ఉండే అవకాశముంది. అయితే ఈ ధరలు రాష్ట్రానికోసం మారవచ్చు. ఎందుకంటే ATFపైనా వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధించేది రాష్ట్ర ప్రభుత్వమే. విమానాల్లో వాడే ఇంధనం అత్యుత్తమ ప్రమాణాలు కలిగినదే అయినా, పన్నుల భారం తక్కువగా ఉండటం, శుద్ధి ప్రక్రియ తక్కువ ఖర్చుతో సాగటం వంటివి దీని ధరను పెట్రోల్‌తో పోల్చితే తక్కువగా ఉంచుతున్నాయి. అందుకే విమాన ఇంధనం చౌకగా కనిపిస్తోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అసలు నిజం ఇదే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News