Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Fridge: ఫ్రిజ్​లో ఈ 7 ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతున్నారా? అయితే, జర భద్రం!

Fridge: ఫ్రిజ్​లో ఈ 7 ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతున్నారా? అయితే, జర భద్రం!

Foods not to put in Fridge: మనం తినే ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి తాజాగా, ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయని అనుకుంటాం. కానీ, నిజానికి కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే ఫ్రిజ్‌లో పెడితే చేస్తే తాజాగా ఉంటాయి. మిగతావి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచే బదులుగా బయట నిల్వ ఉత్తమం. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు చెడిపోయే ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని ఆహారాలు:

తరిగిన ఉల్లిపాయ

సగం కోసిన ఉల్లిపాయ లేదా తరిగిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఎందుకంటె బ్యాక్టీరియా, దుర్వాసనను పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా సంక్రమణ అవకాశాలను పెంచుతుంది.

 

ఒలిచిన వెల్లుల్లి

ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే, దానిలో ఫంగస్ పెరుగుతుంది. దీంతో వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో ఇన్ఫెక్షన్లు రావడం ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో తొక్క తీసిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో నిల్వ చేయకపోవడమే మంచిది.

 

తేనె

తేనెను ఎప్పుడు ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఎందుకంటే దీని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు తేనె స్ఫటికీకరిస్తుంది. దీని కారణంగా దాని రుచి, సహజ ఎంజైమ్‌లు తొలగిపోతాయి. దీనికి బదులుగా తేనెను బయట నిల్వ చేయడం బెస్ట్.

 

ప్లాస్టిక్ బాటిల్

ప్లాస్టిక్ బాటిల్ నుండి BPA, హానికరమైన రసాయనాలు పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితిలో ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని నింపి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దీనికి బదులుగా గాజు బాటిల్‌ను ఉపయోగించడం మంచిది. ఇది ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. పైగా ఈ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Also Read: Healthy Weight Loss Tips: వేయిట్ లాస్ కోసం బెస్ట్‌ డైట్ ప్లాన్ ..

బంగాళాదుంప

బంగాళాదుంపను ఫ్రిజ్‌లో ఉంచితే దానిలోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఈ బంగాళాదుంపను ఉడికించినట్లయితే, విషపూరితమైన అక్రిలామైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. కావున బంగాళాదుంపను బయట నిల్వ చేయడం ఉత్తమం.

 

నెయ్యి

ఫ్రిజ్‌లో నెయ్యి ఉంచితే అది గట్టిగా మారుతుంది. దాని ఆకృతి కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఫ్రిజ్‌లో నెయ్యిని ఉంచడానికి బదులుగా, దానిని గది ఉష్ణోగ్రత వద్ద బయట పెట్టాలి.

 

అరటిపండ్లు

అరటిపండ్లను చల్లని ఉష్ణోగ్రతలో ఉంచితే అవి త్వరగా కరుగుతాయి. ఇది అరటిపండులోని పోషకాలను కూడా తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad