Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Banana Peel: అరటి తొక్కతో ఇలా చేస్తే..చందమామ లాంటి అందం..!

Banana Peel: అరటి తొక్కతో ఇలా చేస్తే..చందమామ లాంటి అందం..!

Banana peel Face Pack: ఈరోజుల్లో మెరిసే చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి ? అందుకే చాలామంది అందంగా కనిపించడానికి మార్కెట్లో లభించే అనేక రకాల క్రీములు వాడుతుంటారు. ఫలితంగా ఇవి ముఖ సౌందర్యాన్ని పెంచే బదులుగా, అనేక దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అయితే తెలుసా?, వీటికి బదులుగా ఇంట్లోనే సహజ పద్ధతిలో అందాన్ని మెరుగుపరచు కోవచ్చని! అవును, అరటిపండు తొక్కలు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. తిన్న అరటిపండు తొక్క పడేయకుండా ఇలా చర్మంపై ఉపయోగించడం వల్ల అందం రెట్టింపు అవుతుంది.

- Advertisement -

అరటిపండు తొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ తొక్కలను ముఖానికి పూయడం వల్ల ముఖం శుభ్రంగా ఉంటుంది. ఇది చర్మం నుండి చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. అంతేకాదు, చర్మాన్ని హైడ్రేట్ కూడా చేస్తుంది. ఇది ఎండ కారణంగా ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగిస్తుంది. దీంతో ముఖం మెరుస్తుంది. దీని కోసం ఇంట్లోనే అరటి తొక్కలతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

అరటి తొక్క ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా కొన్ని అరటి తొక్కలను తీసుకోవాలి. తర్వాత పేస్ట్ లాగా మారేవరకు వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం ఈ అరటిపండు తొక్క పేస్ట్‌లో అర చెంచా బియ్యం పిండి, అర చెంచా చక్కెర కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి. దాదాపు అరగంట తర్వాత మంచి నీటితో పేస్ వాష్ చేసుకోవాలి. ఇలా ఈ ఫేస్ ప్యాక్ ని క్రమం తప్పకుండా వాడితే, కొన్నిరోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. బియ్యం పిండిలో ఉండే స్టార్చ్ చర్మానికి మెరుపు, బిగుతును ఇస్తుంది. అంతేకాకుండా చక్కెరలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. అరటిపండులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు, టానింగ్ ని తొలగిస్తుంది.

Also Read:Pumpkin Seeds: ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడికాయ గింజలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఏమిటో తెలుసా..?

అరటి తొక్క వెనుక భాగాన్ని ముఖంపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న వల్ల మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాదు, ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

అరటి తొక్కను మెత్తగా రుబ్బి తేనెతో కలిపి కూడా ముఖానికి అప్లై చేయొచ్చు. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. తాజాగా కనిపిస్తుంది కూడా!

అలాగే, అరటి తొక్కను గ్రైండ్ చేసి దానికి పెరుగు వేసి బాగా కలిపి ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ని ముఖానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంలోని మచ్చలు తొలగిపోయి. ముఖం సహజంగా కాంతివంతంగా మారుతుంది.

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad