Thursday, May 1, 2025
Homeలైఫ్ స్టైల్Beer Bath: బీర్ బాత్ చేస్తే ఆ సమస్య రాదంట.. ఇదెక్కడి ట్రెండ్ రా మామ..!

Beer Bath: బీర్ బాత్ చేస్తే ఆ సమస్య రాదంట.. ఇదెక్కడి ట్రెండ్ రా మామ..!

స్నానం అంటే మనకు మొదట గుర్తొచ్చేది నీళ్లే. కానీ ఇటీవల పలు దేశాల్లో ఇటీవల ఓ చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. అదే ‘బీర్ బాత్’ ఏంటి షాక్ అయ్యారా.. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మం మెరుస్తుందని, ఒత్తిడి తగ్గుతుందని, శరీరం డీటాక్స్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఈ బీర్ బాత్ స్పాల డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పుడు మన దేశంలో కూడా కొంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు.

- Advertisement -

వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. బీర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయని చెబుతున్నారు. బీరులో ఉండే ఈస్ట్, విటమిన్ బి చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. అలాగే చర్మంపై ఉన్న డెడ్ సెల్స్‌ను తొలగించడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో జాయింట్ల నొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. బీరుతో పాటు వేడి నీళ్లు, పూల రెక్కలు, నిమ్మకాయల తొక్కలు కలిపి స్నానం చేస్తే మరింత రిలాక్స్ ఫీలవుతుందని అంటున్నారు. కొన్ని రీసెర్చ్‌లు కూడా దీన్ని సమర్థిస్తున్నాయి. శరీరం రిలాక్స్ అవుతుందని.. మనసు ప్రశాంతంగా మారేందుకు దీన్ని వాడతారని చెబుతున్నారు. ఎక్కువసేపు నీళ్లలో మునిగి ఉన్నా ఒత్తిడి తగ్గుతుందన్నది ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అయితే బీర్ బాత్‌నే ఏకైక డీటాక్స్ విధానంగా పరిగణించరాదు. శరీరం సహజంగా చెమట, మూత్రం, జీర్ణ వ్యవస్థల ద్వారా టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ సరిగ్గా సాగితే వేరే ఎలాంటి బాహ్య సహాయం అవసరం ఉండదు. కానీ శరీరంలో సమస్యలు ఉంటే అలాంటి పద్ధతులు ఉపయోగపడతాయి. బీర్ బాత్ కూడా అలాంటి ప్రయత్నాల్లో ఒకటి మాత్రమే అని చెబుతున్నారు.

బీర్ బాత్ వంటివి వినూత్నంగా, వింతగా అనిపించినా.. కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీన్ని పూర్తిగా నమ్ముకోవడం మంచిది కాదు. దీన్ని ప్రత్యేక అనుభవం కోసమే తీసుకోవాలే గానీ ఆరోగ్య సంరక్షణకు ప్రధాన మార్గంగా భావించకూడదని, సహజమైన పద్ధతులే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారం, సరిపడిన నీళ్లు, వ్యాయామం తప్పనిసరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News