BeetRoot: అందమైన, మెరిసే చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకే చాలామంది అందంగా కనిపించడానికి మార్కెట్లో లభించే అనేక రకాల క్రీములు వాడుతుంటారు. ఫలితంగా ఇవి ముఖ సౌందర్యాన్ని పెంచే బదులుగా, అనేక దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అయితే తెలుసా?, వీటికి బదులుగా ఇంట్లోనే సహజ పద్ధతిలో అందాన్ని మెరుగుపరచు కోవచ్చని! అవును, బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.
ఇందులో విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, ముఖానికి సహజమైన మెరుపును అందిస్తాయి.అంతేకాదు ఇవి చర్మం నుండి చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. ఈ క్రమంలో బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ తయారు కోసం కావలసినవి ఏంటి? ఫేస్ ప్యాక్ తయారు, అప్లై చేసే విధానం ఏంటి? బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ కోసం కావలసినవి:
2 టీస్పూన్లు బీట్‌రూట్ రసం
1 టీస్పూన్ శనగ పిండి
1 టీస్పూన్ పెరుగు లేదా రోజ్ వాటర్
1/2 టీస్పూన్ తేనె (పొడి చర్మం ఉన్నవారికి)
also read:Weight Loss: ఇంటి దగ్గర ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బరువు ఇట్టే తగ్గుతారు..
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం:
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఈ పేస్ ప్యాక్ కోసం ముందుగా ఒక గిన్నెలో తాజా బీట్‌రూట్ రసం తీసుకోవాలి. తర్వాత దానికి తగ్గినంత శనగ పిండి, పెరుగు జోడించాలి. అనంతరం రోజ్ వాటర్ ఉపయోగించాలి (జిడ్డుగల చర్మం ఉంటే), లేదా తేనె జోడించవచ్చు(పొడి చర్మం ఉంటె). ఇప్పుడు అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. తద్వారా ఇది మృదువైన పేస్ట్ లాగా తయారు అవుతుంది.
ఎలా అప్లై చేయాలి?
ఈ ఫేస్ ప్యాక్ ను కళ్ళు, పెదవుల చుట్టూ ఉన్న ప్లేస్ లో తప్ప మిగతా మొత్తం లో బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. దాదాపు 15-20 నిమిషాలు పాటు ముఖాన్ని ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రాంగా క్లీన్ చేసుకోవాలి. అనంతరం తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా ఈ బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల చర్మంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు:
1. బీట్‌రూట్ రసంలోని సహజ వర్ణద్రవ్యం చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. ముఖాని మెరిసేలా చేస్తుంది.
2. క్రమం తప్పకుండా బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ వాడితే, ముఖంపై మొటిమల మచ్చలు, సన్ టాన్, పిగ్మెంటేషన్ క్రమంగా మాయమవుతాయి.
3. ఈ ఫేస్ ప్యాక్‌లోని సహజ పదార్థాలు చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తాయి.
4. బీట్‌రూట్‌లో కనిపించే యాంటీఆక్సిడెంట్లు ముఖంపై ఉన్న ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడతాయి.


